బాలీవుడ్ డ్రగ్స్: బీజేపీ ఎంపీ కామెంట్లపై జయ బచ్చన్ ఆగ్రహాం, ఇండస్ట్రీని తక్కువ చేసేలా..
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. నిన్న లోక్‌సభలో బీజేపీ ఎంపీ, భోజ్‌పురి నటుడు రవికిషన్ చేసిన కామెంట్లను సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయ బచ్చన్ తప్పుపట్టారు. ఆయన పేరు ప్రస్తావించకుండా కామెంట్ చేశారు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని తక్కువచేసేలా కామెంట్ చేయడం సరికాదని మంగళవారం రాజ్యసభలో జయ బచ్చన్ తెలిపారు.
వినోద రంగానికి చెందిన వ్యక్తులను విమర్శిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారని జయ బచ్చన్ తెలిపారు. అయితే వారి వాదనతో తను ఏకీభవించబోను అని ఆమె తెలిపారు. అలాంటి భాష వాడి సినిమా ఇండస్ట్రీకి చెందినవారిని తక్కువ చేయొద్దని సూచించారు. కానీ మీరు మొత్తం పరిశ్రమ పేరు/ ప్రఖ్యాతలను దెబ్బతీయలేరు అని పేర్కొన్నారు. కానీ ఇండస్ట్రీకి చెందిన ఒకరు లోక్ సభలో కామెంట్ చేయడం మాత్రం సరికాదని జయ అభిప్రాయపడ్డారు.

సినీ పరిశ్రమకు సంబంధించి అంశంపై చర్చిచేందుకు జీరో అవర్‌లో జయ బచ్చన్ నోటీసు ఇచ్చారు. ఆ మేరకు కామెంట్ చేశారు. డ్రగ్స్ గురించి సోమవారం బీజేపీ ఎంపీ రవికిషన్ ప్రస్తావించారు. బాలీవుడ్ మొత్తాన్ని మాదకద్రవ్యాలు ప్రభావితం చేసిందని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేసేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. జీరో అవర్ సందర్భంగా సమస్యను ప్రస్తావించారు.
Recommended Video
చైనా, పాకిస్తాన్ నుంచి దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయని తెలిపారు. ఇక్కడి యువతను చెడగొట్టేందుకు పొరుగుదేశాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో బాగా పనిచేస్తుందని తెలిపారు. దీనిపై జయా బచ్చన్ పేరు ప్రస్తావించకుండా మండిపడ్డారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications