గృహహింస కేసులో.. మాజీ సీఎం అల్లుడు అరెస్టు..
న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ అల్లుడు ఇమ్రాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షీలా కూతురు లతిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇమ్రాన్ ను అరెస్టు చేశారు. గత కొద్దిరోజులుగా వీరి వైవాహిక జీవితంలో విభేదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే భర్త ఇమ్రాన్ పై గృహహింస చట్టం కింద కేసు పెట్టారు లతిక. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా.. ఇమ్రాన్ ను అరెస్టు చేశారు. కొన్నాళ్లు సాఫీగానే సాగిన వీరి వైవాహిక జీవితంలో.. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రతరం కావడంతోనే లతిక పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది.













Click it and Unblock the Notifications