అద్వానీ భావోద్వేగం: షికారా మూవీ చూస్తూ.. కన్నీరు ఆపుకోలేక: కాశ్మీరీ పండిట్స్ వెతలపై..!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ తన కుటుంబంతో కలిసి బాలీవుడ్ మూవీ షికారాను తిలకించారు. ఆయన కోసం ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సినిమా చూస్తున్నంత సేపూ అద్వానీ భావోద్వేగానికి గురయ్యారు. కాశ్మీరీ పండిట్లు, కాశ్మీరులో నివసిస్తోన్న హిందువులు ఎదుర్కొన్న కష్టనష్టాలను కథాంశంగా చేసుకుని రూపొందించిన సినిమా అది. సినిమా చూస్తూ ఆయన కన్నీటిని ఆపుకోలేకపోయారు.
ప్రముఖ దర్శకుడు విధు వినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించారు. తన సొంత బ్యానర్ వినోద్ చోప్రా ఫిల్మ్‌పై సుమారు వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో దీన్ని రూపొందించారు. ఆదిల్ ఖాన్, సాదియా, ఫైజల్ సిమోన్ తదితరులు నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాశ్మీరీ పండిట్లపై తెరకెక్కించిన సినిమా కావడంతో దీన్ని తిలకించడానికి అద్వానీ ఆసక్తి చూపారు.

దీనితో ఆయన కోసం ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. తన కుటుంబంతో కలిసి సినిమాను చూశారాయన. విధు వినోద్ చోప్రా.. ఆయనకు స్వాగతం పలికారు. సినిమా చూస్తున్న సమయంలో ఆయన కాళ్లకు నమస్కరించారు. సినిమా గురించి వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా షికారా మూవీ సన్నివేశాలు అద్వానీని తీవ్రంగా కదిలించినట్టున్నాయి. తన భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
वयोवृद्ध लालकृष्ण आडवाणी आज "शिकारा" फ़िल्म की स्पेशल स्क्रीनिंग में पहुंचे..
— आदित्य तिवारी ( Aditya Tiwari ) (@adityatiwaree) February 7, 2020
विधु विनोद चोपड़ा ने स्वागत किया
L K Advani at the special screening of #Shikarareview.@AdityaRajKaul @AnupamPKher pic.twitter.com/HPDM768oFF












Click it and Unblock the Notifications