బెంగళూరులో దారుణం.. ఎయిర్ ఫోర్స్ అధికారిపై బైకర్ దాడి.. ట్విస్ట్ ఏంటంటే?
కర్ణాటకలోని బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, అతని భార్యపై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. కారులో ఎయిర్ పోర్టుకు వెళ్తున్న తమను ఓ బైకర్ అడ్డగించి కన్నడ భాషలో బూతులు తిడుతూ తమపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో పోలీసులు ఉన్నారు. కానీ ఇక్కడ ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పిన కథనం ప్రకారం భారీ ట్విస్ట్ ఉంది. అది ఏంటో తెలుసా..?
ఏం జరిగింది ?
బెంగళూరులో దారుణమైన ఘటన జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన అధికారి ఆదిత్య బోస్.. తన భార్య స్క్వాడ్రన్ లీడర్ మధుమితతో కలిసి కారులో సీవీ రామన్ నగర్, డీఆర్ డీఓ కాలనీ నుంచి ఎయిర్ పోర్ట్ కు వెళ్తున్నారు. ఇంతలో ఓ బైకర్ వెనుక నుంచి ఫాలో అవుతూ వచ్చి కారుకు అడ్డుపడ్డాడు. కన్నడ భాషలో దుర్భాషలు ఆడాడు. బోస్ సతీమణిని కూడా కన్నడలో బూతులు తిట్టాడు. ఇది గమనించిన బోస్.. కిందకు దిగి అతడ్ని వారించే ప్రయత్నం చేశారు.

కానీ ఆ బైకర్ తన దగ్గర ఉన్న కీతో బోస్ ముఖంపై గట్టిగా పొడిచాడు. దీంతో అతని ఫేస్ మొత్తం రక్తస్రావం అయింది. వెంటనే ఆ బైకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బోస్ వాపోయారు. ఈ మేరకు ఘటన జరిగిన విధానాన్ని తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. బెంగళూరులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఈ వీడియోలో బోస్ వివరించారు. చుట్టూ ఉన్న వాళ్లు తమనే తిట్టారని వాపోయారు బోస్.
అయితే తాజాగా ఆ బైకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడ్ని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ఓ షాకింగ్ ట్విస్ట్ వెల్లడైంది. ప్రత్యక్ష సాక్షి చెప్పిన ప్రకారం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారే ఆ డెలివరీ బాయ్ బైకర్ ను చితకబాదాడు. దాదాపు 20 నుంచి 30 పంచ్ లు గుద్దాడు. అయితే ఎవరు ఫస్ట్ కొట్టారో మాత్రం తెలియదు. బోస్ ఫేస్ పైనా మొత్తం రక్తం ఉంది కాబట్టి.. ఎవరు ఫస్ట్ కొట్టారో చూడలేదని ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. దీంతో పోలీసులు ఈ కేసును మరింత క్షుణ్ణంగా విచారిస్తున్నారు. అనుమానాలు ఉన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Bengaluru Road Rage Case Probe #UPDATE | Police arrest the accused biker.
— TIMES NOW (@TimesNow) April 21, 2025
There was a delivery guy from Bengaluru who was a Kannadiga. The IAF officer beat the delivery boy a lot, 20-30 punches. But I don't know who hit whom first because the army officer's face was already… pic.twitter.com/0ClhpULPgX
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications