సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని పెళ్లి క్యాన్సెల్.. వరుడికి షాక్
పూర్వం వివాహం అంటే వధూవరుల కుటుంబాలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసేవారు.. ఆ తర్వాత అబ్బాయి లేదా అమ్మాయి గుణగణాలు, కుటుంబం ఆస్తిపాస్తులు చూస్తారు. కానీ మహారాష్ట్రలో జరిగిన ఈ షాకింగ్ ఘటన వింటే మారుతున్న పరిస్థితుల్లో కేవలం వధూవరుల గుణగణాలు, ఆస్తిపాస్తులు మాత్రమే కాకుండా అంతకు మించి చెక్ చేస్తారని తెలిసింది. మహారాష్ట్రలోని మూర్తాజా పుర్ లో వరుడి సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని వివాహం రద్దు చేసుకుంది వధువు కుటుంబం.
ఏం జరిగింది..?
మహారాష్ట్రలోని మూర్తాజాపుర్ కు చెందిన వధువుకు అదే ప్రాంతానికి చెందిన వరుడితో వివాహం కుదిరింది. ఇద్దరి కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. అయితే ఇరు కుటుంబాల సభ్యులంతా ఒకే దగ్గర కూర్చుని ఒకరికొకరు తెలుసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో వధువు అంకుల్ వరుడి సిబిల్ స్కోర్ చూడాలని పట్టుబట్టాడు. ఆ తర్వాత వరుడి సిబిల్ స్కోర్ చూసి షాక్ అయ్యాడు. అతడు ఇప్పటికే అనేక బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు వధువు అంకుల్ గుర్తించాడు. సిబిల్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉండటం వల్ల పెళ్లి రద్దు చేశాడు. అప్పుల్లో కూరుకుపోయిన వరుడు.. తమ కుమార్తెకు ఆర్థిక భరోసాను ఎలా కలిగిస్తాడని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

సిబిల్ స్కోర్ అంటే..?
సిబిల్ స్కోరును క్రెడిట్ ఇన్ఫర్మేషన్ లిమిటెడ్ అందిస్తుంది. వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని ఈ సిబిల్ స్కోరు సూచిస్తుంది. ఈ స్కోరు ఆధారంగానే బ్యాంకులు రుణాలు వేగంగా ఇస్తాయి. వ్యకులు గతంలో తీసుకున్న లోన్స్, క్రెడిట్ కార్డు వినియోగం .. తదితర విభాగాలను లెక్కించి సిబిల్ స్కోర్ అందిస్తుంది.












Click it and Unblock the Notifications