అంతెత్తు పార్లమెంట్ గోడ దూకి.. లోనికి వెళ్లాడు: హల్ చల్

దేశ రాజధానిలో కలకలం చెలరేగింది. పార్లమెంట్ భవనం గోడ దూకి లోనికి ప్రవేశించాడో ఆగంతకుడు. హల్ చల్ రేపాడు. అనుమానాస్పదంగా తచ్చాడుతున్న అతన్ని భద్రత సిబ్బంది సకాలంలో గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఈ తెల్లవారు జామున 6:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి ఓ చెట్టు సహాయంతో గోడ ఎక్కి పార్లమెంట్ లోనికి ప్రవేశించాడు. రైల్ భవన్ వైపు పార్లమెంట్ గోడకు ఆనుకుని ఏపుగా పెరిగిన ఓ చెట్టును ఎక్కి.. అనంతరం పార్లమెంట్ గోడపై ఎగబాకాడని, అక్కడినుంచి లోనికి దూకాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పార్లమెంట్ లోనికి ప్రవేశించిన తర్వాత గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు.

Shocking Security Incident Intruder Caught Scaling Parliament Walls

అక్కడ అతన్ని భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. గత ఏడాది ఆగస్టులో కూడా ఇలాంటి భద్రతా ఉల్లంఘన సంభవించింది. అప్పట్లో ఓ 20 ఏళ్ల యువకుడు పార్లమెంట్ ఆవరణలో ఉన్న ఓ భవనం ప్రాంగణంలోకి గోడ దూకి ప్రవేశించాడు.

అతన్ని సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ బలగాలు పట్టుకున్నాయి. అతన్ని సోదా చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఇప్పుడు కూడా అదే ఆగస్టులో ఏకంగా పార్లమెంట్ ఆవరణలోనికి ప్రవేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రత లోపాలను తేటతెల్లం చేసినట్టయింది.

2001 పార్లమెంట్ పై భీకర ఉగ్రవాద దాడి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 2023లో కూడా ఇలాంటి ఘటనే సంభవించింది. జీరో అవర్‌లో ఇద్దరు వ్యక్తులు లోక్‌సభ గ్యాలరీ నుండి సభలోకి దూకారు. క్యానైస్టర్‌ల నుండి గ్యాస్‌ను విడుదల చేశారు. వారిని అక్కడే ఉన్న ఎంపీలు పట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+