వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13 ఏళ్లకే ఇంత పచ్చిగా..! 'నలుగురైదుగురితో సెక్స్'

|
Google Oneindia TeluguNews

అమెరికా : అభివృద్దిలో టాప్ అని చెప్పుకునే అమెరికా.. ఫాస్ట్ కల్చర్ లోను అంతే ఫాస్ట్. ఎంత ఫాస్ట్ అంటే.. ! గట్టిగా 14 ఏళ్లు కూడా నిండని విద్యార్థులు నలుగురైదుగురితో సెక్స్ సంబంధాలు కొనసాగించేంతగా. స్కూల్ కి వెళ్లే వయసులోనే శృంగారంలో ఆరిపోతున్నారు అక్కడి విద్యార్థులు. చదువు చుట్టూ తిరగాల్సిన వాళ్ల ఆలోచనలు 'డ్రగ్స్-సెక్స్' చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అమెరికన్ పిల్లలు మహా ముదుర్లు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ షాకింగ్ విషయాలు ఓ సర్వే సంస్థ నివేదిక ద్వారా వెల్లడయ్యాయి. అలాగని ఇదేం సీక్రెట్ గా నిర్వహించిన సర్వే ఏమి కాదు. అక్కడి స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు ఈ తరహా సర్వేపై ముందుగానే సమాచారమిచ్చిన సర్వే సంస్థ వాళ్ల అనుమతితోనే సర్వే నిర్వహించింది. సర్వేలో భాగంగా.. స్కూల్ విద్యార్థుల్లో సెక్స్ కి సంబంధించిన అవగాహనపై సర్వే నిర్వహించింది సదరు సంస్థ.

happy

కాగా, సర్వేలో వెల్లడైన విషయాలు మాత్రం అమెరికన్లను షాక్ కి గురిచేస్తున్నాయి. సర్వే ప్రశ్నలకు విద్యార్థులు ఇచ్చిన సమాధానాలను పరిశీలిస్తే.. చాలామంది విద్యార్థులు స్మోకింగ్ మరియు డ్రింకింగ్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా చెప్పారు. అలాగే 13 ఏళ్ల వయసులోనే అక్కడి విద్యార్థులు డ్రగ్స్, సెక్స్ పట్ల విపరీతమైన ఆసక్తికర కనబరుస్తున్నట్టు నివేదికలో నివ్వెరపోయే నిజాలు వెల్లడయ్యాయి.

తరుచూ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు అక్కడి చాలామంది విద్యార్థులు చెప్పగా.. దాంతో పాటే 13 ఏళ్ల లోపే వారు నలుగురైదుగురితో సెక్స్ సంబంధాలు కొనసాగిస్తున్నట్టు చెప్పడం గమనార్హం. ఇక గతంలోను ఇలాంటి సర్వే నిర్వహించగా.. 47 శాతం మంది స్కూల్ విద్యార్థులు ఇంకా సెక్స్ లో పాల్గొనలేదని చెప్పగా, ఈ దఫా ఆ సంఖ్య 41 శాతానికి పడిపోయింది.

ఇకపోతే సెక్స్ సంబంధాలకు అలవాటుపడ్డ అక్కడి విద్యార్థులు.. సెక్స్ తదనంతర పరిణామాలపై కూడా అప్రమత్తతోనే వ్యవహరిస్తున్నారని సర్వే వెల్లడించింది. కొంతమంది విద్యార్థులు సెక్స్ సమయంలోనే గర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటే మరికొంతమంది సెక్స్ తర్వాత పిల్స్ ని ఉపయోగించి గర్భం దాల్చకుండా జాగ్రత్తపడుతున్నారట. కాగా, దాదాపు 125 ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ లో 16 వేల మంది విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే నివేదిక తయారు చేసినట్టు సమాచారం.

English summary
Its a shocking survey on american students that revealed their sexual thoughts and drug habbits are disgusting their parents
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X