Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావుకు షాక్.. మీడియా సమావేశంలో బూటుతో దాడి ( వీడియో )

Recommended Video

    బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావుపై బూటుతో దాడి || Oneindia Telugu

    న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావుపై బూటు దాడి చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆయనపై బూటు విసిరాడు. దేశ రాజధానిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. కాంగ్రెస్ సానుభూతిపరుడే తనపై దాడి చేసి ఉంటాడని జీవీఎల్ ఆరోపించారు. రెండో దశ పోలింగ్ సందర్భంగా గురువారం మధ్యాహ్నం జీవీఎల్ నరసింహా రావు పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ సీనియర్ నేత భూపేంద్ర యాదవ్ తో కలిసి పోలింగ్ సరళి మీద ఆయన మాట్లాడారు.

    బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాబోతోందని ఆయన అన్నారు. తొలిదశలాగే.. మలి దఫా కూడా తమ పార్టీకి అనుకూలంగా పోలింగ్ సరళి సాగుతోందని చెప్పారు. ఆయన మాట్లాడుతుండగానే.. విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఓ వ్యక్తి తన కాలి బూటును తీసి జీవీఎల్ మీదికి బలంగా విసిరాడు.

    Shoe hurled at BJP MP GVL Narasimha Rao during a press conference

    అనుకోకుండా చోటు చేసుకున్న ఘటనతో అందరూ జీవీఎల్ సహా అందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకున్న జీవీఎల్ వ్యక్తిగత సిబ్బంది బూటు విసిరిన వ్యక్తిని వెనుక నుంచి బలంగా పట్టుకున్నారు. అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లారు. అతణ్ణి శక్తి భార్గవగా గుర్తించారు. మరిన్ని వివరాలపై ఆరా తీస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+