Girl: బర్త్ డే పార్టీలో గ్యాంగ్ రేప్, రివాల్వర్ తో కాల్పులు, అమ్మాయి ప్రాణం కాపాడిన మొబైల్ ఫోన్ !

పూణే/ముంబాయి/ చెన్నై: బాయ్ ఫ్రెండ్ వెంట బర్త్ డే పార్టీకి వెళ్లిన అమ్మాయి జీవితం నాశనం అయ్యింది. బర్త్ డే పార్టీ నుంచి ఇంటికి వెళ్లడానికి సిద్దం అయిన అమ్మాయిని కామాంధులు ఓ రూమ్ లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు ఆమెను మళ్లీ అదే గదిలో బంధించారు. రూమ్ లో నుంచి తప్పించుకుని ఆ అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నించడతో ఓ కామాంధుడు రివాల్వర్ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. అయితే అమ్మాయి మొబైల్ ఫోన్ ఛాతికి అడ్డం పెట్టుకోవడం, బుల్లెట్ మొబైలో లోకి దూసుకోవడంతో సినిమా ఫక్కీలో తీవ్ర గాయాలైన ఆమె ప్రాణాలతో బయటపడింది.

ఫ్రెండ్ బర్త్ డే పార్టీ

ఫ్రెండ్ బర్త్ డే పార్టీ

మహారాష్ట్రలోని పూణే నగరంలోని వార్జే మాల్వాడి ప్రాంతంలో ఓ మైనర్ బాలిక నివాసం ఉంటోంది. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉండటంతో ఆ పార్టీకి హాజరుకావాలని ఆ అమ్మాయి నిర్ణయించింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె బర్త్ డే పార్టీకి వెళ్లింది. రాత్రి వరకు బర్త్ డే పార్టీలో స్నేహితులతో కలిసి ఆ అమ్మాయి సంతోషంగా గడిపింది.

కామాంధుల కన్ను పడింది

కామాంధుల కన్ను పడింది


బర్త్ డే పార్టీలో సూపర్ గా ఉన్న ఆ అమ్మాయి మీద కొందరు కామాంధుల కన్నుపడింది. కావాలనే అమ్మాయితో రాసుకునిపూసుకుని తిరగడానికి ప్రయత్నించారు. అమ్మాయి పక్కనే ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ కామాంధులకు రెండుమూడు సార్లు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడని తెలిసింది.

రూమ్ లో గ్యాంగ్ రేప్

రూమ్ లో గ్యాంగ్ రేప్

బర్త్ డే పార్టీ పూర్తి కావడానికి ఆలస్యం కావడంతో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇంటికి వెళ్లడానికి సిద్దం అయ్యాయింది. అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోతుందని పసిగట్టిన కామాంధులు ఆమెను సమీపంలోని ఓ రూమ్ లోకి ఎత్తుకుని వెళ్లారు. ఒకరి తరువాత ఒకరు అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశారు.

రివాల్వర్ తో కాలుస్తా

రివాల్వర్ తో కాలుస్తా

అమ్మాయి మీద అత్యాచారం చేసిన కామాంధులు ఆమె రూమ్ లో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మీద నిందితులు దాడి చేశారు. చివరికి ఆ అమ్మాయి గదిలో నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే కాల్చేస్తానని ఒకడు బెదిరించాడు.

ప్రాణం కాపాడిన మొబైల్ ఫోన్

ప్రాణం కాపాడిన మొబైల్ ఫోన్

అయినా లెక్కచెయ్యని ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. అదే సమయంలో మరో నిందితుడు రేయ్ కాల్చేయ్ అంటూ రివాల్వర్ చేతిలో పట్టుకున్న వ్యక్తిని రెచ్చగొట్టాడు. ఆ సమయంలో అమ్మాయి మీద రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. అమ్మాయి భయంతో చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఆమె ఛాతికి అడ్డంగా పెట్టుకోవడంతో మొబైల్ ఫోన్ లోకి తూటా దూసుకుపోయింది.

కామాంధుల కోసం వేట

కామాంధుల కోసం వేట


అమ్మాయికి బుల్లెట్ గాయం కావడంతో హడలిపోయిన కామాంధులు ఆమెను, ఆమె బాయ్ ఫ్రెండ్ ను ఓ ఆసుపత్రిలో పడేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. అమ్మాయి, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు కామాంధులను పోలీసులు అరెస్టు చేశారు. తప్పించుకుని పారిపోయిన మరో ముగ్గురు కామంధుల కోసం గాలిస్తున్నామని, అమ్మాయికి చికిత్స అందిస్తున్నామని పూణే పోలీసు అధికారులు తెలిపారు. బర్త్ డే పార్టీలో ఇంత దారుణం జరగడంతో పూణే ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+