సిద్దూ, డీకే మళ్లీ ఢిల్లీకి జంప్, అందరూ ఆహ్వానితులే, మంత్రుల జాబితా !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలో 135 సీట్లు సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. శనివారం మద్యాహ్నం 12. 30 గంటలకు కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాల్లో తేలుతున్నారు. అందుకోసం భారీ ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం డీకే శివకుమార్ స్వయంగా కంఠీరవ స్టేడియంలోకి వెళ్లి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు.

ఈ సందర్బంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. సిద్దరామయ్య, తాను ఈరోజు మళ్లీ ఢిల్లీ వెలుతున్నామని, తాను ప్రతిఒక్కరిని కలిసి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించలేమని, ఇదే ఆహ్వానం అనుకుని అందరూ శనివారం ఉదయం 11 గంటల లోపే కంఠీరవ స్టేడియం చేరుకుని ప్రమాణస్వీకారం చేస్తున్న మమ్మల్ని ఆశీర్వదించాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మనవి చేశారు.
ಅಖಂಡ ಕರ್ನಾಟಕ ಕಾತುರದಿಂದ ಕಾಯುತ್ತಿರುವ ಐತಿಹಾಸಿಕ ಘಳಿಗೆ ಬಂದಿದೆ. ನಾಳೆ ಕಂಠೀರವ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ನಡೆಯಲಿರುವ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕಾರ ಸಮಾರಂಭಕ್ಕೆ ಆಗಮಿಸುವಂತೆ ಎಲ್ಲರನ್ನೂ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಸ್ವಾಗತಿಸುತ್ತಿದ್ದೇನೆ. pic.twitter.com/bZ0Wiic1uY
— DK Shivakumar (@DKShivakumar) May 19, 2023
సిద్దరామయ్య, డీకే శివకుమార్ శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. మంత్రి పదవుల జాబితా సిద్దం చేసుకున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. సీనియర్ మంత్రుల ఒత్తిడి ఎక్కువ కావడంతో మొదటి విడతలో 20 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించాలని సిద్దరామయ్య, డీకే శివకుమార్ అనుకున్నారని తెలిసింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు 20 మంది మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications