మాట నిలబెట్టుకోండి.. రాజకీయాల నుంచి తప్పుకోండి.. సిద్దూను ఆటాడుకుంటున్న నెటిజన్స్
ఉత్తర్‌ప్రదేశ్ అమేథీలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఓటమి సిద్దూ కొంపముంచింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనతో ఆటాడుకుంటున్నారు. మాట మీద నిలబడమని, రాజకీయాల నుంచి తప్పుకొమ్మంటూ ట్రోల్ చేస్తున్నారు.
Sir reminder @sherryontopp 💐
— Ibn Sina (@Ibne_Sena) May 23, 2019
I will quit politics, if Rahul Gandhi loses Amethi: Navjot Singh Sidhu.
https://t.co/bbYID9jzGW
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ రాహుల్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో రాహుల్‌కు స్మృతి ఇరానీ గట్టి పోటీ ఇస్తారన్న వాదనల్ని ఆయన కొట్టిపారేశారు. ఒకవేళ స్మృతి కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ను ఓడిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. అయితే కాంగ్రెస్ కంచుకోటలాంటి అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఘోర పరాజయం పొందారు. 55వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సిద్ధూతో ఆటాడుకుంటున్నారు.

@sherryontopp as u said if Rahul loses from amethi you will resign from politics, time has come.
— AASHISH KR AHUJA (@AASHISHKRAHUJA) May 23, 2019
we are waiting for your resignation.
గురువారం ఓట్ల లెక్కింపు సందర్భంగా అమేథీలో స్మృతి ఇరానీ ఆధిక్యంలోకి రాగానే సిద్ధూను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. దేశం సిద్ధూ సేవలను కోల్పోనుందని ఒకరు ట్వీట్ చేస్తే.. ఎప్పుడు రాజకీయాలను వీడుతున్నారని మరొకరు సటైర్ వేశారు. రాహుల్ ఓడిపోయారు. మీరు రాజీనామా చేసే సమయం వచ్చింది. మీ రిజిగ్నేషన్ కోసం ఎదురుచూస్తున్నామని కొందరు చురకలంటిస్తే.. అప్పట్లో సిద్ధూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తల లింక్‌లను పోస్ట్ చేసిన మరికొందరు నెటిజన్లు సర్ రిమైండర్ అంటూ ట్వీట్ల దాడి చేశారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్












Click it and Unblock the Notifications