మగజాతి ఆణిముత్యం అన్నా నువ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో బాయ్ మెసేజ్..
మనచుట్టూ ఉన్న చాలామంది పొట్టకూటికోసం పరుగులు పెడుతూనే ఉంటారు. రకరకాల పనుల్లో నిమగ్నమై ఉంటారు. మనుగడ కోసం చాలా కష్టపడుతుంటారు. అలాంటి వారి గురించి తెలుసుకున్న తర్వాత మన సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ కథనం చదివితే ఎవరైనా భావోద్వేగానికి లోనవుతారు. జొమాటో సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. కస్టమర్ కు పెట్టిన ఓ మెసేజ్ ఇప్పుడు లక్షల మంది హృదయాలను కలిచివేస్తోంది.
Things men do for their family! pic.twitter.com/pMsYXNodH8
— Stutii (@Sam0kayy) September 25, 2025
ఆ వ్యక్తికి పుట్టుకతోనే మాటలు రావు. చెవులు వినిపించవు. కానీ అతడు ఏ ప్రభుత్వమో లేక ఎన్జీఓ సహాయం తీసుకోలేదు. వైకల్యం వేధించినా తన కాళ్ల మీద తాను నిలబడాలని సంకల్పించాడు. తాను కుటుంబం కోసం భారం కాకూడదని భావించాడు. తానే కుటుంబాన్ని పోషించేందుకు సిద్ధం అయ్యాడు. మాటలు రాకపోయినా.. చెవులు వినిపించకపోయినా జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్ గా మారాడు. అయితే తాజాగా అతడికి సంబంధించిన మెసేజ్ ను స్తుతి అనే మహిళ స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఫ్యామిలీ కోసం మగవాళ్లు పడే శ్రమ అని ఆమె ఈ పోస్ట్ ను ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే లక్షల మంది ఈ పోస్ట్ చూసి స్పందిస్తున్నారు. డెలివరీ బాయ్ ఆత్మస్థైర్యాన్ని అందరూ కొనియాడుతున్నారు.

ఆ వ్యక్తి పెట్టిన మెసేజ్ లో.. 'నేను మీ ఆర్డర్ తీసుకున్నాను. మరి కొద్దిసేపట్లో డెలివరీ చేస్తాను. నాకు మాటలు రావు, మాట్లాడలేను. చెవులు వినిపించవు. అడ్రస్ వద్దకు వచ్చాక మెసేజ్ చేస్తాను. దయచేసి చూడండి' అని ఆ డెలివరీ బాయ్ కస్టమర్ కు మెసేజ్ పంపినట్లు ఉంది. ప్రస్తుతం ఈ పోస్టుకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మనం పని మానేయడానికి కారణాలను వెతుక్కుంటాం. అతను విధికి ఎదురీదుతున్నాడు. ఇలాంటి వారికి కాస్త టిప్ ఇస్తే ఉపయోగపడుతుంది అని ఒకతను కామెంట్ చేశాడు. ఎదురీత ముందు విధిరాత ఎంత అని మరోవ్యక్తి కామెంట్ పెట్టాడు.












Click it and Unblock the Notifications