love story: నేను ఎవడితో తిరిగితే నీకెందుకు ?, చెల్లిని చంపిన అన్న, వాడు మోసం చేశాడని !
బెంగళూరు: ఉద్యోగం చేస్తున్న చెల్లెలు ఓ యువకుడితో తిరుగుతున్న విషయం ఆమె అన్నకు తెలిసింది. చెల్లిని రెండుమూడు సార్లు అన్న హెచ్చరించినా ఆమె మాటవినలేదని అన్న రగిలిపోయాడు. తాను ఆయువకుడిని ప్రేమిస్తున్నానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెల్లెలు ఎదురుతిరిగింది. సాయంత్రం ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడిపిన చెల్లెలు పొద్దుపోయిన తరువాత ఇంటికి వెళ్లింది. అప్పటికే పని ముగించుకుని ఇంట్లో ఉన్న అన్నకు ఎక్కడో మండిపోయింది. నేను ఎవడితో తిరిగితే నీకెందుకు అంటూ ఎదురుతిరిగిన చెల్లిని కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. చెల్లెలు శవాన్ని తీసుకెళ్లి రైలుపట్టాల మీద విసిరేసిన అన్న నా చెల్లిని ఆమె ప్రియుడు మోసం చెయ్యడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని నాటకం ఆడాడు.

గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం
బెంగళూరులోని హెణ్ణూరులోని టీఎన్ టీ లేఔట్ లో మంగళా రవి (19) అనే యువతి నివాసం ఉంటున్నది. మంగళా రవి, ఆమె అన్న కిరణ్ (25), వీళ్ల తల్లి శాంతా కలిసి నివాసం ఉంటున్నారు. మంగళా రవి తండ్రి లేడు. హెణ్ణూరు సమీపంలోని ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో మంగళా రవి ఉద్యోగం చేస్తున్నది.

మంగళా లవ్ స్టోరీ
మంగళా రవి అన్న కిరణ్ సొంతంగా ఆటో తీసుకుని నడుపుతున్నాడు. మంగళా రవి ఓ యువకుడిని ప్రేమిస్తోందని తెలిసింది. ప్రియుడితో కలిసి మంగళా రవి తిరుగుతున్న విషయం సాటి ఆటో డ్రైవర్లు ఆమె అన్న కిరణ్ కు చెప్పారు. నీ చెల్లి మంగళా ఎప్పుడు పడితే అప్పుడు ఓ యువకుడిని వెంట వేసుకుని తిరుగుతోందని, నువ్వు జాగ్రత్తగా ఉండాలని కిరణ్ ను హెచ్చరించారు.

రగిలిపోయిన అన్న
నువ్వు ఎవరితో తిరుగుతున్నావో తెలుసా, వాడు మంచివాడు కాదు, వాడితో మాట్లాడకూడదని అన్న కిరణ్ అతని చెల్లెలు మంగళా రవిని హెచ్చరించాడు. అన్న వార్నింగ్ ఇచ్చినా మంగళా రవి మాత్రం ప్రేమిస్తున్న యువకుడితోనే తిరగడం మొదలుపెట్టింది. చెల్లెలుకు చెప్పినా నా మాట వినడం లేదని అన్న కిరణ్ మరింత రగిలిపోయాడు.

సెలవు రోజు ఇంత రాత్రి ఏం పని ?
గత ఆదివారం గార్మాంట్స్ ఫ్యాక్టరీకి సెలువు ఉన్నా మంగళా రవి మాత్రం బయటకు వెళ్లింది. రాత్రిపొద్దుపోయే వరకు ప్రేమించిన ప్రియుడితో కలిసి ఏకాంతప్రదేశానికి వెళ్లిన మంగళా రవి పొద్దుపోయిన తరువాత ఇంటికి వెళ్లింది. అప్పటికే ఇంట్లో ఉన్న కిరణ్ ఇంతరాత్రి వరకు నువ్వు ఎందుకు బయటతిరుగుతున్నావు, వాడు నిన్ను వాడుకుని ఎంజాయ్ చేసి వదిలేస్తాడు, ఎంతచెప్పినా నా మాట నువ్వు ఎందుకు వినవు అంటూ చెల్లెలు మంగళాతో గొడవ పెట్టుకున్నాడు.

చెల్లిని ఇంట్లోనే చంపేసిన అన్న
నేను ఎవడితో అయినా తిరుగుతాను, నీకెందుకు అంటూ చెల్లెలు మంగళా ఎదురుతిరగడంతో కిరణ్ సహనం కోల్పోయాడు. అంతే అదేరోజు రాత్రి కత్తి తీసుకున్న కిరణ్ చెల్లెలు మంగళాను ఇంట్లోనే పట్టుకుని కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడవడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

రైలుపట్టాల మీద విసిరేసి డ్రామాలు
మంగళా ప్రాణం పోయిందని కిరణ్ తెలుసుకున్నాడు. ఇంట్లో ఉన్న చెల్లెలు మంగళా శవాన్ని ఆటోలో వేసుకుని తీసుకెళ్లి బయ్యప్పనహళ్ళి సమీపంలోని రైల్వేపట్టాల మీద విసిరేసి వెళ్లిపోయాడు. మరుసటిరోజు రైలు పట్టాల మీద శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

డ్రామాలు భలేవేశాడు
తన చెల్లి మంగళా వేరే వ్యక్తితో తిరుగుతోందని, అతను పెళ్లి చేసుకోకుండా మోసం చెయ్యడంతో ఆత్మహత్య చేసుకుందని అన్న కిరణ్ నాటకాలు ఆడాడు. పోలీసుల విచారణలో చెల్లి మంగళా తన మాట వినకుండా వేరే వ్యక్తితో తిరుగుతోందని, అందుకే తాను ఆమెను హత్య చేశానని అంగీకరించడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications