ఎంపీ అశ్లీల వీడియోలు లీక్ చేసింది ఇతనే?, మంత్రితో క్లోజ్, మంత్రి సీఎంకు క్లోజ్, భలే ఉంది కథ!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హాసన్‌ జేడీఎస్ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు చెందిన అశ్లీల వీడియోల పెన్‌ డ్రైవ్‌ ఎక్కడి నుంచి వచ్చింది ?, ఆ వీడియోలు లీక్ చేసింది ఎవరు ?, వీడియోలు ఇంకా ఎన్ని ఉన్నాయి అంటూ వాటి మూలాన్ని సిట్‌ అధికారులు వెతుకుతున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి రావడం కర్ణాటకలో కలకలం రేపుతోంది.

ఈ కేసులో వినిపిస్తున్న పేర్లలోని ఇద్దరు కూడా పెన్ డ్రైవ్ తాము విడుదల చెయ్యలేదని అంటున్నారు. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు లీక్ చేసింది మేము కాదు అంటే నేను కాదు అంటూ ఇద్దరూ చెబుతున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ కుమారుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ కేసుకు సంబంధించి మరో కలకలం రేపే వాస్తవం బయటకు వచ్చింది. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ సమీపిస్తున్న సమయంలో బీజేపీ-జేడీఎస్ కూటమి హాసన్ ఎంపీ అభ్యర్థి ప్రజల్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు కలకలం రేపుతున్నాయి.

SIT officials issued notices to Naveen Gowda for leaking obscene videos of JDS MP Prajwal Revanna

హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌లో అసభ్యకర వీడియోలను వైరల్ చేసింది ఎవరో ఇప్పుడు తేలింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినదిగా చెబుతున్న ఈ వీడియోలను హాసన్ జిల్లా బేలూరు తాలూకాకు చెందిన నవీన్ గౌడ వైరల్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ నవీన్ గౌడ ప్రభావవంతమైన రాజకీయ నాయకుడు, బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌కు సన్నిహితుడని చెబుతున్నారు.

ఇదే సమయంలో మంత్రి జమీర్‌ అహమ్మద్ ఖాన్ తో నవీన్ గౌడ్ కలసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హాసన్ లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ, బీజేపీ-జేడీఎస్ కూటమి హాసన్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియో విడుదల చేసినందుకు నవీన్ గౌడకు సిట్ నోటీసు జారీ చేసిందని వెలుగు చూసింది. నవీన్ గౌడ అతని ఫేస్‌బుక్‌లో ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు పోస్ట్ చేశాడని ప్రాథమిక విచారణలో వెలుగుచూసింది.

SIT officials issued notices to Naveen Gowda for leaking obscene videos of JDS MP Prajwal Revanna

ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలను పూర్తిగా చూడటానికి ఈ వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో కావాలని నవీన్ గౌడ అతని ఫేస్ బుక్ లో పోస్టు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీన్ని గమనించిన జేడీఎస్ నాయకులు నవీన్ గౌడ పోస్ట్‌ను స్క్రీన్‌షాట్‌ తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన వెంటనే నవీన్ గౌడ తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఆ వీడియో, పోస్టును తొలగించాడని తెలిసింది. ఇప్పుడు విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు నవీన్ గౌడకు నోటీసులు జారీ చేశారు.

నవీన్ గౌడకు సిట్ నుంచి నోటీసు వెళ్లాయని తెలిసింది. కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ. రేవణ్ణ తనయుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియో పెన్ డ్రైవ్ కేసులో నవీన్ గౌడకు సిట్ నోటీసులు జారీ చేసింది. మే 4న విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ చీఫ్ బీకే సింగ్ స్వయంగా నవీన్ గౌడకు ఫోన్ చేసి విచారణకు హాజరు కావాలని సూచించారు. నవీన్ గౌడను విచారణ చేస్తే ఆ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి అని వెలుగు చూస్తుందని తెలిసింది.

SIT officials issued notices to Naveen Gowda for leaking obscene videos of JDS MP Prajwal Revanna

ఇప్పటికే ఫోన్‌లో సిట్ అధికారులకు ప్రాథమిక సమాచారం అందించిన నవీన్‌గౌడనే పెన్‌డ్రైవ్‌ను షేర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నవీన్ గౌడపై హసన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి నవీన్‌గౌడ్‌ను విచారణకు పిలిపించగా ప్రాథమిక సమాచారం సేకరిస్తున్న సమయంలో తాను పెన్‌డ్రైవ్‌ను సోషల్ మీడియాలో షేర్ చెయ్యలేదని నవీన్‌ గౌడ్‌ అధికారులకు చెప్పినట్లు తెలిసింది.

అయితే హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు లీక్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్ గౌడకు మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కు సంబంధాలు ఉన్నాయని వెలుగు చూడటం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. గతంలో మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామికి చాలా సన్నిహితుడిగా ఉన్న జమీర్ అహ్మద్ ఖాన్ తరువాత కాంగ్రెస్ లో చేరి మంత్రి అయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు జమీర్ అహ్మద్ ఖాన్ చాలా సన్నిహితుడు అని ముద్రపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+