సెక్స్ స్కాండల్ కేసు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది ?, మాజీ మంత్రి, ఎంపీ ఇంట్లో పంచనామా !

హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం ఆరోపణల కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ నివాసంలో అత్యాచారం జరిగిందన్న ఫిర్యాదుతో హాసన్ ఎంపీ ప్రజ్వల్ నివాసం గేటుకు తాళం వేశారు. సాక్షాలు ధ్వంసం చేస్తారని ఎంపీ నివాసం గేటుకు తాళం వేశారని వెలుగు చూసింది. హాసన్ లోని నివాసం నుంచి బెంగళూరుకు చేరుకున్న ఎంపీ ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసుకు సంబంధించి ఇద్దరు బాధితులను సిట్‌ అధికారులు హలేనరసీపురలోని హెచ్‌డీ రేవణ్ణ ఇంటికి పిలుచుకుని వెళ్లారు. హాసన్ ఎంపీ ప్రజ్వల్ ఆయన నివాసంలోనే అత్యాచారం చేశాడని ఓ బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ ఏ1 నిందితుడిగా ఉన్నారు. హలేనరసీపురలో లైంగిక వేధింపుల కేసులో మరో బాధితురాలు ఫిర్యాదు చేసింది. సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించి ఇద్దరి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

SIT searched Hassan MP Prajwal and former minister HD Revanna s residence and collected evidence

హలేనరసీపుర ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి వివరాలు సేకరించారు. అంతకు ముందే స్థానిక పోలీసులు ముందుగా రేవణ్ణ నివాసానికి వెళ్లి ఆయన భార్య భవానీ రేవణ్ణకు విషయం చెప్పారు. తరువాత సిట్ బృందం బాధితులతో కలిసి మాజీ మంత్రి రేవణ్ణ నివాసానికి చేరుకుని సోదాలు నిర్వహించింది.రేవణ్ణ నివాసంలో ఓ మహిళపై లైంగిక దాడి జరిగిందని బాధితురాలు హలేనరసీపుర పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన ఇంట్లో విచారణ చేపట్టి వివరాలు సేకరించారు.

అంతకు ముందు వేదికను తయారు చెయ్యడానికి అవసరమైన వస్తువులు, సీపీయూ, మానిటర్, ప్రింటర్‌ను హలేనరసీపుర పోలీసులు మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ నివాసానికి తరలించారు. పంచనామా అనంతరం ఘటనా స్థలంలో బాధిత మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మాజీ మంత్రి రేవణ్ణ తరఫు న్యాయవాది, కొందరు జేడీఎస్ నేతలు సంఘటనా స్థలంలో ఉన్నారు. ఆ సమయంలో భవానీ రేవణ్ణ ఇంట్లోనే ఉన్నారని సమాచారం.విచారణ బృందం బాధితురాలిని ఇంట్లోకి తీసుకెళ్లి వంటగది, పడకగది, స్టోర్ రూంలో సోదాలు చేసి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

SIT searched Hassan MP Prajwal and former minister HD Revanna s residence and collected evidence

మాజీ మంత్రి రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ ఇంట్లో లేని సమయంలో ఈ మూడు ప్రాంతాల్లో తన మీద లైంగిక దాడి జరిగిందని బాధితురాలు ఆరోపించింది.

హాసన్ ఎంపీ
ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హాసన్ లోని ఆర్సీ రోడ్డులోని ప్రజ్వల్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక డీఆర్వో పోలీసులు చేరుకుని నివాసానికి బందోబస్తు ఏర్పాటు చేశారు.

అత్యాచారం ఆరోపణలకు గురైన బాధితురాలిని ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ నివాసానికి తీసుకొచ్చి ఆమె వాగ్మూలం సేకరిస్తారని తెలిసింది. అంతకు ముందు ప్రజ్వల్ రేవణ్ణ పీఏ దగ్గర ఉన్న ఎంపీ నివాసం తాళం చెవిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు కావడంతో ఎంపీ ఇంటి తాళం స్వాధీనం చేసుకుని అక్కడ సాక్షాలు నాశనం కాకుండా జాగ్రత్త పడ్డారు. ఇదే సమయంలో జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు ఫిర్యాదు చెయ్యడంతో కేసు రసవత్తరంగా మారింది. ఈ కేసులో ప్రజ్వల్ ఏ1 నిందితుడు. ఇదే నివాసం నుంచి బెంగళూరుకు చేరుకున్న ప్రజ్వల్ రేవణ్ణ అక్కడి నుంచి డిప్లమాటిక్ పాస్ పోర్టు ద్వారా విదేశాలకు వెళ్లిపోయాడని ఆరోపణలు ఉన్నాయి.

అయితే ప్రజ్వల్ రేవణ్ణ మాత్రం ఇంత వరకు సిట్ కు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్ కేసుకు సంబందించి మహిళను కిడ్నాప్ చేశారని అరెస్టు అయిన హెచ్ డీ రేవణ్ణను నాలుగు రోజుల పాటు సిట్ కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అంగీకరించింది. కోర్టు ఆదేశాలతో మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ఆయన్ను విచారణ చేస్తున్నారు. తన సెక్స్ స్యాండల్ కేసులో కన్న తండ్రి అరెస్టు అయినా ఇంత వరకు ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారుల ముందు హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+