బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sketch: విదేశీయులతో డీల్, స్టూడెంట్స్, టెక్కీలు టార్గెట్, గర్ల్ ఫ్రెండ్ కోసం ఏం చేశాడంటే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న యువకులు కష్టపడకుండా ఉద్దరగా డబ్బులు సంపాధించాలని స్కెచ్ వేశారు. విదేశీయులతో పరిచయాలు పెంచుకున్న యువకులు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయించడం మొదలు పెట్టారు. కాలేజ్ లో చదువుతున్న యువకులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, కార్పోరేట్ ఉద్యోగులను వీరు టార్గెట్ చేసుకున్నారు. అద్దె ఇంటిలో నివాసం ఉంటూ పగలు మొత్తం ఖాళీగా ఉంటూ అప్పుడప్పుడు బయటకు వెళ్లి వస్తున్న యువకులు రెండు కుక్కలను పెంచుకుంటూ లగ్జరీ లైఫ్ గడపడం మొదలు పెట్టారు. పోలీసులకు అనుమానం వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. నిందితులను అరెస్టు చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో అరెస్టు అయిన ఓ యువకుడి దిమ్మతిరిగిపోయే లవ్ స్టోరీ బయటకు రావడంతో పోలీసులు షాక్ అయ్యారు. ప్రేమ కోసం వలలో పడినే పాపం పసివాడు అంటున్నారు ఐటీ హబ్ పోలీసులు.

Hijab Row: హిజాబ్, చెప్పిందే చెప్పి కోర్టు టైమ్ వేస్ట్ చేస్తున్నారు, విచారణ వాయిదా వేసిన హైకోర్టు !Hijab Row: హిజాబ్, చెప్పిందే చెప్పి కోర్టు టైమ్ వేస్ట్ చేస్తున్నారు, విచారణ వాయిదా వేసిన హైకోర్టు !

బెంగళూరులో నివాసం

బెంగళూరులో నివాసం


ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేరళకు చెందిన షమీర్, సాహిర్ అనే ఇద్దరు యువకులు అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. కేరళ నుంచి బెంగళూరు చేరుకుని హెచ్ఏఎల్ సమీపంలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న షమీర్, సాహిర్ అనే యువకులు కష్టపడకుండా ఉద్దరగా డబ్బులు సంపాధించాలని స్కెచ్ వేశారు.

 నైజీరియా దేశీయులతో స్నేహం

నైజీరియా దేశీయులతో స్నేహం


నైజీరియాకు చెందిన కొందరు బెంగళూరులో నివాసం ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తూ ఇప్పటికే చాలా మంది పోలీసులకు చిక్కిపోయిన విషయం తెలిసిందే. నైజీరియా వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్న షమీర్, సాహిర్ గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరులోని వివిద ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయించడం మొదలు పెట్టారు.

కాలేజ్ స్టూడెంట్స్, టెక్కీలు టార్గెట్

కాలేజ్ స్టూడెంట్స్, టెక్కీలు టార్గెట్

కాలేజ్ లో చదువుతున్న యువకులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, కార్పోరేట్ ఉద్యోగులను షమీర్, సాహిర్ టార్గెట్ చేసుకున్నారు. అద్దె ఇంటిలో నివాసం ఉంటూ పగలు మొత్తం ఖాళీగా ఉంటూ అప్పుడప్పుడు బయటకు వెళ్లి వస్తున్న షమీర్, సాహిర్ లు రెండు కుక్కలను పెంచుకుంటూ లగ్జరీ లైఫ్ గడపడం మొదలు పెట్టారు.

పక్కా సమాచారంతో అరెస్టు

పక్కా సమాచారంతో అరెస్టు

బెంగళూరు పోలీసులకు అనుమానం వచ్చి షమీర్, సాహిర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. నిందితులను అరెస్టు చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో అరెస్టు అయిన షమీర్ అనే యువకుడి దిమ్మతిరిగిపోయే లవ్ స్టోరీ బయటకు రావడంతో పోలీసులు షాక్ అయ్యారు.

 ప్రియురాలి కోసం డ్రగ్స్ వ్యాపారం

ప్రియురాలి కోసం డ్రగ్స్ వ్యాపారం


కేరళకు చెందిన ఓ యువతిని షమీర్ ప్రేమించాడు. షమీర్ ప్రేమను అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఇదే సమయంలో డ్రగ్స్ విక్రయిస్తూ అరెస్టు అయిన షమీర్ సంవత్సరం పాటు జైల్లో ఉన్నాడు. జైలు నుంచి బయటకు రావడానికి షమీర్ కు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చు అయ్యిందని, ఆ డబ్బు సంపాధించి ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి మళ్లీ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడని పోలీసు అధికారులు అన్నారు.

English summary
Sketch: Kerala based two drug peddlers arrested in Bengaluru City in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X