బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sketch: అమెజాన్ లో వ్యాపారం చెయ్యాలని రూ. 12 లక్షలు, అప్పడాల కర్ర మిగిలింది, నాట్ రీచబుల్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: చేతిలో లక్షల రూపాయల డబ్బులు ఉన్నా మంచి వ్యాపారం చెయ్యడానికి అవకాశం చిక్కడం లేదని ఓ వ్యక్తి ఆలోచనలో పడ్డాడు. మంచి వ్యాపారం చేసి నెలనెల లక్షల రూపాయలు డబ్బులు సంపాధించాలని అతను అనుకున్నాడు. ఓ వ్యక్తి ఫోన్ చేసి అమెజాన్ లో పెట్టుబడి పెట్టి ఆన్ లైన్ వ్యాపారం చేస్తే మంచి కమీషన్ వస్తుందని చెప్పాడు. అమెజాన్ లో వ్యాపారం చేస్తూనే ప్రతినెల లక్ష వరకు జీతం తీసుకోవచ్చిన చెప్పాడు. అమెజాన్ లో మొదట పెట్టుబడి పెట్టాలని చెప్పాడు. తరువాత ఇద్దరూ చాలాసార్లు కలిసి మాట్లాడకున్నారు. అమెజాన్ ఆన్ లైన్ వ్యాపారం చేస్తే లక్షలు లక్షలు డబ్బులు సంపాధించాలని ఆశపడ్డాడు. వెంటనే రూ. 12 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. .డబ్బు చెల్లించి నెలలు గడిచిపోతున్నాడు కమీషన్ రాకపోవడం, డబ్బు తీసుకున్న వ్యక్తి ఫోన్ స్విచ్ చేసి మాయం కావడంతో వ్యాపారం చెయ్యాలని అశపడిన వ్యక్తి షాక్ అయ్యాడు. అమెజాన్ పేరుతో ఆ వ్యక్తి ఎలా మోసపోయాడో తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు.

Wife: మేడ కింద బావ, మేడ మీద భర్తతో కాపురం, భార్య గొంతు కోసి నీట్ గా చంపేసిన భర్త, అక్క చూస్తే !Wife: మేడ కింద బావ, మేడ మీద భర్తతో కాపురం, భార్య గొంతు కోసి నీట్ గా చంపేసిన భర్త, అక్క చూస్తే !

 బెంగళూరులో వ్యాపారం చెయ్యాలని ?

బెంగళూరులో వ్యాపారం చెయ్యాలని ?


బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని కూడ్లు మెయిన్ రోడ్డులో శ్రీనివాస్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చేతిలో లక్షల రూపాయల డబ్బులు ఉన్నా మంచి వ్యాపారం చెయ్యడానికి అవకాశం చిక్కడం లేదని శ్రీనివాస్ ఆలోచనలో పడ్డాడు. మంచి వ్యాపారం చేసి నెలనెల లక్షల రూపాయలు డబ్బులు సంపాధించాలని శ్రీనివాస్ అనుకున్నాడు.

హలో..... అమెజాన్ లో ఇన్వెస్ట్ చెయ్యండి

హలో..... అమెజాన్ లో ఇన్వెస్ట్ చెయ్యండి

ఆగస్టు నెలలో శ్రీనివాస్ కు కిరణ్ అనే పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అమెజాన్ లో పెట్టుబడి పెట్టి ఆన్ లైన్ వ్యాపారం చేస్తే మంచి కమీషన్ వస్తుందని కిరణ్ బెంగళూరులో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కు చెప్పాడు. అమెజాన్ లో వ్యాపారం చేస్తూనే ప్రతినెల రూ. 1 లక్ష వరకు జీతం తీసుకోవచ్చిన కిరణ్ చెప్పాడు.

మొత్తం బాగానే ఉందని అనుకున్నాడు

మొత్తం బాగానే ఉందని అనుకున్నాడు

అమెజాన్ లో మొదట రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలని, తరువాత కమీషన్ తో పాటు జీతం కూడా వస్తుందని శ్రీనివాస్ కు కిరణ్ చెప్పాడు. తరువాత శ్రీనివాస్, కిరణ్ ఇద్దరూ చాలాసార్లు నేరుగా కలుసుకుని కలిసి మాట్లాడకున్నారు. శ్రీనివాస్ దగ్గర లక్షలు లక్షలు డబ్బులు ఉందని, అతన్ని బుట్టలో వేసుకోవాలని కిరణ్ పక్కా స్కెచ్ వేశాడు.

రూ. 12. 12 లక్షలు గోవిందా

రూ. 12. 12 లక్షలు గోవిందా


అమెజాన్ ఆన్ లైన్ వ్యాపారం చేస్తే లక్షలు లక్షలు డబ్బులు సంపాధించాలని శ్రీనివాస్ ఆశపడ్డాడు. వెంటనే రూ. 12 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చెయ్యాలని శ్రీనివాస్ డిసైడ్ అయ్యాడు. కిరణ్ చెప్పిన అబ్యాంకు అకౌంట్ కు శ్రీనివాస్ రూ. 12. 12 లక్షలు పంపించాడు. .డబ్బు చెల్లించి నెలలు గడిచిపోతున్నా కమీషన్ రాకపోవడంతో శ్రీనివాస్ కు అనుమానం వచ్చింది.

ఆవేశం వద్దు....... వెయిట్ చేస్తే వస్తుంది

ఆవేశం వద్దు....... వెయిట్ చేస్తే వస్తుంది

శ్రీనివాస్ డబ్బులు తీసుకున్న కిరణ్ కు ఫోన్ చేశాడు. అమెజాన్ నుంచి తనకు ఇంత వరకు ఒక్కరూపాయి కూడా కమీషన్ రాలేదని, ఆ డబ్బులు బ్యాంకులో ఉంటే కనీసం వడ్డి అయినా వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నువ్వు కొంతకాలం ఓపికపడితే నీ డబ్బుతో పాటు కమీషన్, జీతం కూడా వస్తుందని కొంతకాలం కిరణ్ కాలం గడిపేశాడు. తనకు కమీషన్ వద్దు, జీతం వద్దు, నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయ్ అంటూ శ్రీనివాస్ గట్టిగా అడిగాడు.

ఫోన్ స్విచ్ ఆఫ్..... మనిషి మాయం

ఫోన్ స్విచ్ ఆఫ్..... మనిషి మాయం

డబ్బులు తీసుకున్న కిరణ్ అతని ఫోన్ స్విచ్ చేసి మాయం కావడంతో వ్యాపారం చెయ్యాలని అశపడిన శ్రీనివాస్ షాక్ అయ్యాడు. తాను మోసపోయానని శ్రీనివాస్ బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. శ్రీనివాస్ స్టోరీ తెలుసుకున్న పోలీసులు ఓరి పిచ్చోడా, ఇలాంటి మోసాలు పదేపదే వెలుగు చూస్తున్నా గుడ్డిగా అతనికి రూ. 12 లక్షలు ఎందుకు ఇచ్చావు అన్నారు. శ్రీనివాస్ నుంచి డబ్బులు వసూలు చేసి మాయం అయిన మోసగాడి కోసం బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Sketch: Rs 12 lakhs fraud in the name of Amazon in Bengaluru City in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X