పాముకు గుండెపోటు... సిపిఆర్ చేసిన కానిస్టేబుల్..
ఈ మధ్యకాలంలో గుండెపోటు వార్తలు తరుచుగా వింటున్నాం. గుండెపోటు వస్తే సిపిఆర్ ఎలా చేయాలని కూడా చాలామంది పోలీసులు అప్పట్లో చేసి చూపించారు. అయితే, మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో పాముకు గుండెపోటు వచ్చింది. దాంతో అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి దానికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నోట్లోకి గాలి ఊదుతూ..
మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలోని సేమరి హరిచంద్ పోలీస్ పోస్ట్ పరిధిలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారుతోంది. స్థానికంగా ఉన్న ఓ ఇంటి వద్దకు ఇటీవల ఓ పాము వచ్చింది. దీంతో భయపడిపోయిన గ్రామస్థులు పాముకు పక్కకు పంపించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే ఆ నేపథ్యంలో ఆ పాము ఓ పైపులోకి దూరిపోయింది. ఆ పామును చంపేందుకు అక్కడివారు పురుగుల మందును పైపులోకి వేశారు.

ఈ మందు తాగిన పాము అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయితే, విషయం తెలుసుకున్న హరిచంద్ పోలిస్ స్టేషన్ కానిస్టేబుల్ అతుల్ శర్మ అక్కడికి వచ్చాడు. ఆ పామును పరిశీలించి, దాన్ని పక్కకు తీసుకెళ్లి నీళ్లు పోసి శుభ్రం చేయడం జరిగింది. తర్వాత పామును బతికించేందుకు సిపిఆర్ చేశాడు. చాలా సార్లు పాము నోట్లోకి గాలి ఊదుతూ సిపిఆర్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో కాసేపటికే పాము స్పృహలోకి వచ్చిది. తర్వాత ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలేశాడు.
15 ఏళ్లలో తాను 500 పాములను రక్షించాడు..
అయితే, ఈ సందర్భంగా అతుల్ శర్మ మాట్లాడుతూ.. పన్నెండో తరగతి నుంచే పాములను కాపాడి అటవీ ప్రాంతాల్లో వదిలేవాడినని చెప్పాడు. గత 15 ఏళ్లలో తాను 500 పాములను రక్షించినట్లు శర్మ పేర్కొన్నారు. డిస్కవరీ ఛానెల్‌ని ఎక్కువగా చూసి, ఇలాంటివి అనుసరిస్తున్నానని శర్మ చెప్పుకొచ్చాడు.
A police constable in Madhya Pradesh is giving CPR to a snake that had fallen unconscious after being exposed to pesticide-laced water. The constable, Atul Sharma, used mouth-to-mouth resuscitation to revive the snake, which was later released safely.#Viral #Snake #CPR pic.twitter.com/2uwV957jTf
— AH Siddiqui (@anwar0262) October 26, 2023
పాములు కనిపిస్తే చంపకుండా తనకు గానీ, స్నేక్ క్యాచర్లకు గానీ సమాచారం అందించాలని గ్రామస్థులకు సూచించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు కానిస్టేబుల్‌ను అభినందిస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇంకా ఈ పోలీస్ చేస్తున్న పనికి చాలామంది నెటిజన్లు సెల్యూట్ సార్ అని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications