VIRAL VIDEO: ఈ కష్టం ఇంకెవరికి రాకూడదు.. కారణం అదే !
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కామెడీ, హర్రర్, రొమాంటిక్, డివోషనల్ లేదా ఏదైనా లీక్ వీడియో, ఇంటరెస్టింగ్ గా ఉండేవి వైరల్ అవుతూనే ఉంటాయి. అలానే సాధారణంగా పాములకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగానే చూస్తూ ఉంటాం.
మాములుగా అయితే పెద్ద పెద్ద పాములు, ఒకే చోట ఎక్కువ పాములు ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. సహజంగా అయితే కొన్ని వీడియోలు చుస్తే భయం కలగడం.. కొన్ని ఆశ్చర్యపరచడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరా అవుతున్న వీడియో గమనిస్తే మాత్రం.. ఎమోషనల్ అవ్వడం గ్యారంటీ అని అనిపిస్తుంది.

ఇరుక్కుపోయిన పాము తల..
పాము తల ఓ ప్లాస్టిక్ బాటిల్ లో ఇరుక్కుపోయింది. దీంతో మూతను తీసుకోలేక అలానే తిరుగుతూ, తడబడుతూ కనిపిస్తుంది. వేరే ఏ జంతువు అయినా కూడా తమ చేతులను ఉపయోగించి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ పాముల విషయంలో ఆలా చేయలేవు కాబట్టి అలానే తిప్పలు పడడం పట్ల వన్యప్రాణుల ప్రేమికులు ఎమోషనల్ అవుతున్నారు. కామెంట్స్ రూపంలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవ్వడం ఒకటైతే.. అడవుల్లో, రోడ్ల పక్కన, కాలువల్లో విసిరే ప్లాస్టిక్ బాటిల్లు, మూతలు జంతువులకు ఇబ్బందులు తెస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications