అందుబాటులో లేని కొందరు నేతలు.. ఆప్ ఆందోళన, బీజేపీ బేరసారాల నేఫథ్యంలో..
ఆప్ కొందరు ఎమ్మెల్యేలు సమావేశానికి రాకపోవడంతో ఆ పార్టీలో కలకలం రేపుతోంది. కొందరికీ బీజేపీ బేరసారాలు చేస్తుందని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే సమావేశం నిర్వహించగా.. కొందరు డుమ్మా కొట్టారు. దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
బీజేపీలో చేరితే ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నేతలు తమకు ఆఫర్ ఇచ్చారని నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు చెప్పిన సంగతి తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి అందుబాటులో లేరు. ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తూ ఓ తీర్మానం ఆమోదించింది.

కోట్లాది రూపాయలు ఆశ చూపించి, తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఢిల్లీలో మద్యం విధానంలో అక్రమాలు జరిగినట్లు సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మరో 14 మందిపై కేసు నమోదు చేసింది. దీని లింకులు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించాయి. బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై తప్పుడు ఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సీబీఐ రైడ్‌కు ఆదేశించడంపై కమిటీ అసంతృప్తితో ఉందని ఆప్ పీఏసీ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్ తెలిపారు. సిసోడియాపై పీఏసీ విశ్వాసం ఉందని పేర్కొంది. సీబీఐ సిసోడియాకు వ్యతిరేకంగా ఏమీ కనుగొనలేదని సింగ్ పేర్కొన్నాడు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications