మూడేళ్లుగా రాఖీ కట్టింది.. చివరికి వాడితోనే.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. సంచలన విషయాలు బయటకు..!
మేఘాలయ కపుల్స్ మిస్సింగ్ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కట్టుకున్న భర్తను పది రోజులకే చంపించింది ఆ యువతి. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన ప్రియుడి మోజులో పడి ఓ అమాయకుడి నిండు జీవితాన్ని బలి తీసుకుంది. దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలులోకి వస్తున్నాయి.
తాజాగా సోనమ్ రఘువీంశీని ఆమె కుటుంబం బహిష్కరించింది. ఘనంగా పెళ్లి చేస్తే ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపడంపై ఆమె కుటుంబ సభ్యులే ఇప్పుడు సోనమ్ ను ఉరితీయండి అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆమె ఎంతటి పాపానికి ఒడిగట్టిందో తెలుసుకోవచ్చు. తాజాగా సోనమ్ రఘవంశీ సోదరుడు గోవింద్.. మృతిచెందిన రాజా రఘువంశీ ఫ్యామిలీని కలిసి ఓదార్చాడు. ఈ మేరకు తన సోదరి సోనమ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. సోనమ్ ను ఉరితీసినా తప్పులేదని స్పష్టం చేశాడు.
మధ్యప్రదేశ్ ఇండోర్ లోని రాజా రఘువంశీ ఇంటికి చేరుకున్న గోవింద్.. రాజా తల్లిదండ్రులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు. " రాజా రఘువంశీ కుటుంబానికి నేను క్షమాపణలు చెప్పాను. మా చెల్లిని ఈ కుటుంబానికి ఇచ్చాం. దీంతో నాకు ఈ ఫ్యామిలీకి సంబంధం ఉన్నట్లే. తప్పు చేసి ఉంటే నా చెల్లి సోనమ్ ను ఉరితీసినా తప్పు లేదు. రాజ్ కుష్వాహా మా కంపెనీలో పనిచేసేవాడు. అతడు సోనమ్ ను అక్క అని పిలిచేవాడు. సోనమ్.. రాజ్ కుష్వాహాకు మూడేళ్లుగా రాఖీ కట్టింది. కానీ వారి మధ్య ఈ రిలేషన్ ఉందని తెలియదు " అని సోనమ్ సోదరుడు గోవింద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇదే విషయాన్ని రాజ్ కుష్వాహా తల్లిని అడగ్గా.. తనకు వారిద్దరి మధ్య ఇలాంటి రిలేషన్ ఉన్నట్లు తెలియదని చెప్పుకొచ్చింది. రాజ్ కుష్వాహా, సోనమ్ ఇద్దరూ అక్కా తమ్ముళ్లుగా పిలుచుకునేవారని తెలిపారు. దీంతో పోలీసులు ఈ కోణాన్ని చూసి షాక్ అవుతున్నారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పక్కా ప్లాన్ తో సోనమ్.. భర్త రాజా రఘువంశీని హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి సోనమ్ ను అరెస్టు చేసి షిల్లాంగ్ కు తరలించారు.
అయితే ప్రస్తుతం సోనమ్ ను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని.. ఆమె గర్భిణిగా ఉందా లేదా అనేది నిర్ధరణ కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. బుధవారం క్రైమ్ సీన్ ను రీ కన్‌స్ట్రక్ట్ చేసి ఆమెను కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు.












Click it and Unblock the Notifications