ప్రమాణ స్వీకారానికి ముందే డేంజర్ బెల్స్

Modi's swearing-in ceremony: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఇంకాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడోసారి ప్రధానిగా ఈ సాయంత్రం 7:15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ అధినేతగా మోదీని ఎన్నికైన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో ఆయన ఎన్నికయ్యారు. రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి ఆయన పేరును ప్రతిపాదించగా.. మిగిలిన వారు ఏకగ్రీవంగా ఆమోదించారు.

Sonia Gandhi slams Modi as he lost the mandate

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ 292 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోయినప్పటికీ- భాగస్వామ్య పక్షాల సహాయంతోఈ మేజిక్ ఫిగర్‌ను అందుకుంది బీజేపీ.

తనకు మద్దతు ఇచ్చే సభ్యుల సంతకాలతో కూడిన లేఖను మోదీ.. రాష్ట్రపతికి అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఈ సాయంత్రం 7:15 నిమిషాలకు మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణం చేస్తారు. మోదీ ప్రమాణ స్వీకార నేపథ్యంలో- ఢిల్లీలో కనివినీ ఎరుగని భద్రతను ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో- కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీపై నిప్పులు చెరిగారు. మొన్నటి ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా మోదీ ప్రధాని కాబోతోన్నారని విమర్శించారు. 10 సంవత్సరాల మోదీ పరిపాలనను భరించలేకే ప్రజలు బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఇవ్వలేదని గుర్తు చేశారు.

అయినప్పటికీ- మొండిపట్టు, ప్రధాని పదవిపై ఉన్న ఆశతో ప్రమాణ స్వీకారం చేయబోతోన్నారని సోనియా గాంధీ ధ్వజమెత్తారు. ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీని కట్టబెట్టనప్పుడే నైతికంగా మోదీ ఓడిపోయారని, ఫలితంగా దేశాన్ని పరిపాలించే హక్కును కూడా కోల్పోయాడని సోనియా గాంధీ అన్నారు.

దశాబ్ద కాలంగా పార్లమెంట్‌ ఉభయసభలను ఎన్డీఏ- బుల్‌డోజ్ చేసిందని, ఇకపై అలాంటి పరిస్థితులు తలెత్తనివ్వబోవని ఆమె అన్నారు. 2014 నుంచి పార్లమెంటరీ కమిటీలు చేసిన సూచనలు, సిఫారసులను ఎన్డీఏ ఏనాడూ పట్టించుకోలేదని, ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిన పరిపాలనను నియంతృత్వంగా మార్చివేసిందని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+