స్పోర్ట్స్ కోటా: దక్షిణ మధ్య రైల్వే రిక్రూట్‌మెంట్: 2017-18
స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది భారతీయ రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ పరిధిలోని గ్రూప్-సి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ.30 వేలు నుంచి రూ.40 వేలు వరకు వేతనం అందజేస్తారు. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించిన వారిని ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా చేర్చుకుంటారు.
ఆర్గనైజేషన్: దక్షిణ మధ్య రైల్వే
ఖాళీలు: గ్రూప్-సి పోస్టులు (స్పోర్ట్స్ కోటా)- 21
క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, హ్యాండ్‌బాల్, ఖో-ఖో, టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, హాకీ.

విద్యార్హతలు: పదో తరగతి/ ఇంటర్/ ఐటీఐ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఒలింపిక్స్/ ప్రపంచ కప్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, దక్షిణాసియా క్రీడలలో పాల్గొని ఉండాలి. జాతీయ క్రీడలు లేదా నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో తొలి మూడు స్థానాలు సాధించి ఉండాలి.
జాబ్ లొకేషన్: సికింద్రాబాద్(తెలంగాణ)
వయోపరిమితి: 2018 జనవరి 1 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కూడా మినహాయింపు లేదు.
దరఖాస్తుల స్వీకరణ: నవంబర్ 25, 2017
దరఖాస్తులకు తుది గడువు: డిసెంబర్ 27, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/yRkA4Y












Click it and Unblock the Notifications