వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెబ్బళి విమానాశ్రం మూసివేత: ప్రయాణీకులకు అందని లగేజ్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: స్పైస్ జెట్ విమానం ప్రమాదానికి గురికావడంతో కర్ణాటకలోని హుబ్బళి ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసి వేశారు. ఆదివారం రాత్రి హుబ్బళి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న స్పైస్ జెట్ విమానం వెనుక టైరు పేలిపోయి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కర్ణాటక మంత్రి రోషన్ బేగ్, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు 78 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

రన్ వే విస్తరించాలని 2014 ఆగస్టు 1వ తేదిన హుబ్బళి ఎయిర్ పోర్టును తాత్కలికంగా మూసి వేశారు. అనంతరం రన్ వే విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి. టెక్నికల్ సమస్యలతో మరి కొంతకాలం ఎయిర్ పోర్టు మూత పడింది. నిపుణులు పరిశీలించిన తరువాత మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభించారు. ఇప్పుడు విమానం ప్రమాదానికి గురికావడంతో ఎయిర్ పోర్టు మాత పడింది.

SpiceJet plane that skidded off the runway

ఆదివారం రాత్రి నుండి ఒక్క విమానం హుబ్బళి ఎయిర్ పోర్టుకు రాలేదు. ఇక్కడకు వచ్చే విమానాల సర్వీసులను బెల్గాం విమానాశ్రంకు మళ్లించారు. ఆదివారం బెంగళూరు నుండి హుబ్బళి బయలుదేరి వెళ్లిన ప్రయాణికుల లగేజ్ లు ఇప్పటి వరకు వారికి చేతికి చిక్కలేదు. ప్రమాదం ఏలా జరిగింది అని దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు ప్రయాణికుల లగేజ్‌లు వారికి అప్పగించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

హుబ్బళి ఎయిర్ పోర్టు విమానాశ్రయం నుండి మళ్లి విమాన సేవలు ఎప్పటి నుండి ఉంటాయి అని అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. సోమవారం రాత్రి డీజీసీఏ అధికారులు హుబ్బళి విమానాశ్రం చేరుకున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు.

English summary
The SpiceJet plane that skidded off the runway while landing at the Hubli Airport. Airport Closed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X