శ్రీదేవి మృతి: అది చెప్పి రాదు, ఆ రెండింటికీ తేడా ఏమిటి?

హైదరాబాద్: అతిలోక సుందరి శ్రీదేవి అకస్మాత్తుగా మరణించారు. ఆమె కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అది హార్ట్ అటాక్ కాదని అంటున్నారు. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ - రెండూ ఒక్కటి కావని నిపుణులు చెబుతున్నారు.

Recommended Video

    Sridevi Passes Away : అందమే శాపమైందా, అవే ప్రాణాలకు ముప్పు తెచ్చాయా?

    శ్రీదేవి అకస్మాత్తు మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఆందాల సుందరి కావడం వల్లనే కాదు, ఆనారోగ్యానికి సంబంధించిన ఆనవాళ్లేమీ ఆమెలో కనిపించలేదు. ఆమె ఆరోగ్యంగానే కనిపించారు. పైగా 54 ఏళ్లు పెద్ద వయస్సేమీ కాదు.

     ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు...

    ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు...

    శ్రీదేవి జబ్బు పడిన సందర్బాలు ఏమీ లేవు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు ఆమె చికిత్స చేయించుకున్న సందర్భాలు కూడా లేవు. శ్రీదేవికి ఆరోగ్య సమస్యలేమీ లేవని ఆమె మరిది సంజయ్ కపూర్ కూడా చెప్పారు. ఆమె చాలా ఫిట్‌గానే కనిపిస్తూ వస్తున్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే గుర్తు పట్టడం అంత కష్టమేమీ కాదు.

     అది చెప్పి రాలేదు...

    అది చెప్పి రాలేదు...

    శ్రీదేవి హార్ట్ ఎటాక్‌తో కాకుండా కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్లు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్‌కీ, కార్డియాక్ అరెస్ట్‌కి కొద్ది తేడా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. కార్డియాక్ అరెస్ట్ ఒకేసారి పెద్ద యెత్తున రావడం వల్ల అక్కడికక్కడ ఆమె కుప్పకూలిపోయారనేది అంచనా.

     సడెన్ కార్డియాక్ అరెస్ట్

    సడెన్ కార్డియాక్ అరెస్ట్

    కార్డియాక్ అరెస్ట్ చెప్పి రాదని నిపుణుల అభిప్రాయం. దానికి ముందు హెచ్చరికలు గానీ, ఆనవాళ్లు గానీ ఏమీ ఉండవు. సడెన్ కార్డియాక్ అరెస్ట్‌లో గుండె స్పందన ఆగిపోయి, మెదడుకూ ఇతర కీలకమైన అంగాలకూ వెంటనే రక్తప్రసరణ ఆగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్ విద్యుత్ షాక్ మాదిరిగా వచ్చేసి నిమిషాల్లో ప్రాణాలు పోతాయి.

     హార్ట్ ఎటాక్ ఎలా..

    హార్ట్ ఎటాక్ ఎలా..

    హార్ట్ ఎటాక్‌లో రక్తం గడ్డ కట్టి గుండెకు రక్తప్రసరణ ఆగిపోతుంది. ధమని మొత్తం బ్లాక్ అవుతుంది.రక్తం లేకపోవడంతో కణాలు ఆక్సిజన్ కోల్పోతాయి. దాంతో మరణం సంభవిస్తుంది. ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల సాధారణంగా ధమనులు మూసుకుపోతాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ కొవ్వు పదార్థాలు ధమనుల్లో పేరుకుపోతాయి. దానివల్ల రక్తం గడ్డకడుతుంది. దానివల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది. దానికి చికిత్స చేయించుకోవడంలో జాప్యం జరుగుతున్న కొద్దీ మృత్యువుకు చేరువ అవుతుంటారు. హార్ట్ అటాక్ ఆనవాళ్లను గుర్తించవచ్చు. హార్ట్ ఎటాక్ రావడానికి ముందు ఛాతీ నొప్పి, ఎడమచేతికి నొప్పి, అసాధారణమైన హృదయ స్పందనలు, తదితర అనవాళ్ల ద్వారా గుండెపోటును గుర్తించవచ్చు. కార్డియాక్ అరెస్టును అలా గుర్తించడానికి వీలు పడదు.

    ఏది అత్యంత ప్రమాదకరం

    ఏది అత్యంత ప్రమాదకరం

    రెండు కూడా ప్రమాదకరమైనవే. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ రెండు కూడా మృత్యువుకే దారి తీస్తాయి. హార్ట్ ఎటాక్ విషయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే అది ప్రమాదాన్ని వివిధ రూపాల్లో హెచ్చరిస్తూ వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అటువంటి హెచ్చరికలు చేయదు. అందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్ ఎటాక్ నుంచి బయటపడవచ్చు.

    వాటికి కారణాలు ఏమిటి...

    వాటికి కారణాలు ఏమిటి...

    కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ రెండు కూడా రావడానికి కారణాలు ఒక్కటే. పొగతాగడం, ఒబిసిటీ, తీవ్రమైన రక్తం పోటు, హై బ్లడ్ కొలెస్టరాల్, డయాబెటిస్, మద్యం సేవనం, బద్దకమైన జీవనశైలి.

     వాటిని ఎలా నివారించవచ్చు

    వాటిని ఎలా నివారించవచ్చు

    హృద్రోగాలకు స్క్రీనింగ్ ద్వారా కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్‌ - రెండింటినీ నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. పోషకాహారం, సమతుల్యమైన బోజనం, శారీరకంగా చురుకుదనం వంటి చర్యల ద్వారా వాటిని నివారించుకోవడానికి వీలుంటుంది. అతిగా బరువు పెరగకుండా చూసుకోవాలి. పొగ తగడాన్ని ఆపేయాలి. మితి మీరి మద్యం సేవించరాదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+