గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయి ఎదుట అతని హస్తప్రయోగం: కాలేజీలో రాత్రి టెన్షన్

బెంగళూరు: తమిళనాడు రాజధాని చెన్నైలోని కట్టకులతూరు ప్రాంతంలోని ఓ కాలేజీలో గురువారం రాత్రి విద్యార్థినులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కాలేజీ క్యాంపస్‌లోని ఓ క్లీనింగ్ ఉద్యోగి ఓ విద్యార్థిని ఎదుట హస్తప్రయోగం చేశాడు. ఈ ఘటనపై విద్యార్థులు భగ్గుమన్నారు.

గర్ల్స్ హాస్టల్‌లోని లిఫ్ట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం నిందితుడు క్యాంపస్ నుంచి పారిపోయినట్లు కాలేజీ వర్గాలు తెలిపారు. అతని ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

 కాలేజీ యాజమాన్యం ఏం చెప్పిదంటే?

కాలేజీ యాజమాన్యం ఏం చెప్పిదంటే?

గర్ల్స్ హాస్టల్ క్యాంపస్‌లో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని కాలేజీ యాజమాన్యం తెలిపింది. అలాగే, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితుడికి సరైన శిక్ష పడేలా చూస్తామని తెలిపింది. అయితే, క్లీనింగ్ ఉద్యోగి తీరు, కాలేజీ యాజమాన్యం స్పందించినప్పటికీ విద్యార్థులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

శానిటేషన్ వర్కర్ దారుణం

శానిటేషన్ వర్కర్ దారుణం

విద్యార్థులు గురువారం రాత్రి క్యాంపస్ లోపల బైఠాయించి, నిరసన తెలిపారు. నిరసనలో పాల్గొన్న థర్డ్ ఇయర్ సాఫ్టువేర్ ఇంజనీర్ విద్యార్థి ఒకరు మాట్లాడుతూ.. యూనివర్సిటీకి చెందిన సెకండియర్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని ఎదుట ఇది జరిగిందని వాపోయారు. శానిటేషన్‌లో పని చేసే ఓ వర్కర్ గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వుమెన్స్ హాస్టల్ లిఫ్ట్‌లో ఆ విద్యార్థిని ఎదుట హస్తప్రయోగం చేశారన్నారు.

లిఫ్టులోనే హస్త ప్రయోగం

లిఫ్టులోనే హస్త ప్రయోగం

నిందితుడు లిఫ్టులోనే అలా చేశాడని చెప్పారు. ఆ వెంటనే బాధితురాలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఇది మిట్ట మధ్యాహ్నం జరిగిందని తెలిపారు. నిరసనలో పాల్గొన్న మరో విద్యార్థి మాట్లాడుతూ.. ఈ విషయమై వార్డెన్‌కు వెంటనే ఫిర్యాదు అందిందని, కానీ సీసీటీవీ ఫుటేజీ చూడటంలో, చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని ఆరోపించారు.

ఉత్తరాది వారి డ్రెస్‌లు, సిగరేట్ వల్ల అంటూ..

ఉత్తరాది వారి డ్రెస్‌లు, సిగరేట్ వల్ల అంటూ..

ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తే ఉత్తరాది యువతుల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, వారు స్మోక్ చేస్తారని, డ్రింక్ చేస్తారని, అందువల్లే ఇలాంటివి జరుగుతున్నాయని కాలేజీకి చెందినవారు అన్నట్లుగా కూడా విద్యార్థులు ఆరోపించారు. సీసీటీవీలో నిందితుడిని గుర్తించినప్పటికి.. ఈ ఘటనపై రాద్దాంతం చేయవద్దని, మౌనంగా ఉండాలని తొలుత విద్యార్థినికి చెప్పారని వాపోయారు. ఈ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఆందోలనకు దిగడంతో పాటు సోషల్ మీడియాలోను తమ విమర్శలు ఎక్కుపెట్టారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో విద్యార్థులు దుమ్మురేపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+