SS Rajamouli: పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చరిత్రలో మిగిపోతాడు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి !
బెంగళూరు: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ కన్నడ సినిమా ప్రమోషన్ కోసం బెంగళూరు వచ్చారు. బెంగళూరులోని యశవంతపురంలోని ఓరియన్ మాల్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా జనని కన్నడ పాటను బెంగళూరులో ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ ప్రెస్ మీట్ పూర్తి అయిన తరువాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నేరుగా బెంగళూరులోని సదాశివనగర్ లోని పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. పవర్ స్టార్ పునీత్ కుమార్ సతీమణి శ్రీమతి అశ్వినీతో పాటు కుటుంబ సభ్యులకు ఎస్ఎస్ రాజమౌళి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజమౌళి పునీత్ రాజ్ కుమార్ గురించి చెప్పిన మాటలతో అందరూ చలించిపోయారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చరిత్రలో నిలిచిపోతారని, ఆయన స్టార్ హీరోలా తనకు కనపడలేదని, పక్కింటి వ్యక్తిలాగా కలిసిపోయేవారని ఎస్ఎస్ రాజమౌళి గుర్తు చేసుకున్నారు.

ఎక్కువసార్లు కలవలేదు కాని ?
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మన మధ్యలేరు అంటే ఇంకా మాకు నమ్మబుద్దికాలేదని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. పునీత్ రాజ్ కుమార్ తో తాను చాలా తక్కువగా కలిశానని, ఒకస్టార్ హీరోతో తాను మాట్లాడుతున్నాను అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ రాలేదని, మన పక్కింటి కుర్రాడితో మాట్లాడుతున్నట్లు మాకే ఉండేదని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.

ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు
నాలుగు సంవత్సరాల క్రితం ఇదే ఇంటిలో తాను పునీత్ రాజ్ కుమార్ ను చివరిసారిగా కలిశానని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గుర్తు చేశారు. అయితే ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ మనందరికి దూరం అయిన తరువాత ఆయన ఇంటి దగ్గర ఇలా మాట్లాడుతానని తాను ఊహించలేదని, ఆయనలేని లోటు ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారని ఎస్ఎస్ రాజమౌళి విచారం వ్యక్తం చేశారు.

ఏదైనా చేస్తే గొప్పలు చెప్పుకుంటారు... కాని పునీత్ రాజ్ కుమార్ !
ఈ కాలంలో ఎవరైనా ఒక్కరికి సహాయం చేస్తే చాలా మందికి చెప్పుకుంటారని ఎస్ఎస్ రాజమౌళి గుర్తు చేశారు. అయితే పునీత్ రాజ్ కుమార్ చేసిన సమాజసేవ గురించి ఆయన చనిపోయే వరకు ఈ ప్రపంచానికి తెలీకుండా చేశారని అది ఆయన గొప్పతనం అని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గుర్తు చేశారు.
Recommended Video

పునీత్ రాజ్ కుమార్ చరిత్రలో నిలిచిపోతారు
పునీత్ రాజ్ కుమార్ ఎంతమందికి సహాయం చేసి ఆదుకున్నారు అనే విషయం ఆయన చనిపోయే వరకు చాలా గోప్యంగా దాచిపెట్టారని, ఆయన లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనపడుతోందని ఎస్ఎస్ రాజమౌళి విచారం వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ చేసిన సేవతో ఆయన చరిత్రలో నిలిచిపోతారని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. ఈ సందర్బంగా ఎస్ఎస్ రాజమౌళి వెంట ఆర్ఆర్ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య, ప్రముఖ కన్నడ నిర్మాత, పునీత్ రాజ్ కుమార్ తో సూపర్ హిట్ సినిమా చక్రవ్యూహ సినిమా నిర్మించిన లోహిత్, కర్ణాటక జూనియర్ ఎన్ టీఆర్ అభిమానుల సంఘం కన్వీనర్, ప్రవాసాంధ్రుడు మాణిక్య తదితరులు పాల్గొన్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రాక సందర్బంగా సదాశివ నగర్ లోని పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇంటి దగ్గర, యశవంతపురంలోని ఓరియన్ మాల్ దగ్గర బెంగళూరు సిటీ పోలీసు అధికారులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications