శశికళ సీఎం కావడమేమిటి: స్టాలిన్, అంతా తూచ్.., స్వామి సూచన..

అధికార పార్టీలో కుమ్ములాటల నేపథ్యంలో స్టాలిన్ స్పందించారు. జయలలితను చూసి తమిళ ప్రజలు ఓటు వేశారని చెప్పారు.

చెన్నై: 'శశికళ ముఖ్యమంత్రి కావడం ఏమిటి? తమిళనాడు ప్రజలు జయలలితను చూసి ఓటేశారు.. వారి కుటుంబ సభ్యులను కాదు.' ఇవీ డిఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు. అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ముఖ్యమంత్రి పీఠం పైన కన్నేసిన విషయం తెలిసిందే.

ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం అన్నాడీఎంకే పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి వారి పైనే ఉంది. మరోవైపు గద్దె దిగేందుకు పన్నీరు సెల్వం సిద్ధంగా లేరు. దీంతో అన్నాడీఎంకే చీలిక దిశగా ఉందని అంటున్నారు.

ఆమె ముఖ్యమంత్రి ఏమిటి.. స్టాలిన్

ఆమె ముఖ్యమంత్రి ఏమిటి.. స్టాలిన్

అధికార పార్టీలో కుమ్ములాటల నేపథ్యంలో స్టాలిన్ స్పందించారు. జయలలితను చూసి తమిళ ప్రజలు ఓటు వేశారని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులను చూసి వేయలేదన్నారు. శశికళ సీఎం కావడం ఏమిటని ప్రశ్నించారు.

అంతా తూచ్

అంతా తూచ్

ఆదివారం జరగనున్న అన్నాడీఎంకే శాసనసభ్యుల సమావేశంలో శశికళను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారనే ప్రచారాన్ని ఆ పార్టీ నాయకులు కొందరు కొట్టి పడేశారు. ప్రభుత్వానికి, శాసనసభ్యులకు మధ్య సమన్వయం కోసమే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సమస్యల పరిష్కారం కోసమే..

సమస్యల పరిష్కారం కోసమే..

ప్రజాప్రతినిధులుగా తమ స్థానిక సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకురావడానికి శశికళ ఈ సమావేశాన్ని నిర్వహస్తున్నారని కొందరు నేతలు చెప్పారు. శశికళను సీఎంగా ఎన్నుకోవడమనే అంశమే అజెండాలో లేదని ఓ మంత్రి చెప్పారు. జయలలిత ఆశయాల సాధనకు తగిన సూచనలు లిఖితపూర్వకంగా అందించాలని గత నెల 27న జరిగిన సమావేశం సందర్భంగా శశికళ సూచించారన్నారు.

సుబ్రహ్మణ్య స్వామి

సుబ్రహ్మణ్య స్వామి

శశికళ పైన ఆదాయానికి మించి ఆస్తుల కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉందని, ఇప్పుడు ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టడం సరికాదని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వస్తే రాజీనామా చేయాల్సి ఉంటుందని, అది మరింత గందరగోళానికి దారి తీస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+