17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు. IMD Mausam App వార్నింగ్

వేసవి కాలం మధ్యలో వాతావరణం వింతగా మారుతోంది. ఏప్రిల్ 18, 2026 నాటి తాజా నివేదికల ప్రకారం, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు సంభవించనున్నాయని IMD హెచ్చరించింది. సుమారు 17 రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు (Heatwaves) జనాలను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి.

వాతావరణం మీ అరచేతిలో.. 'మౌసమ్' యాప్‌తో!

ప్రతికూల వాతావరణం ఎప్పుడు, ఎక్కడ ఎలా మారుతుందో తెలుసుకోవడానికి ప్రభుత్వం రూపొందించిన అధికారిక యాప్ "Mausam". టీవీ వార్తల కోసం ఎదురుచూడకుండా, మీ ప్రాంతంలోని వాతావరణ అప్‌డేట్‌లను నిమిషానికి నిమిషం మీ ఫోన్‌లోనే పొందవచ్చు.

Stay Safe from Sudden Storms How to Use IMD Mausam App to Get Real-Time Weather Alerts on Your Mobile

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

ఆండ్రాయిడ్ యూజర్లు: మీ ఫోన్‌లోని Google Play Storeకి వెళ్లి, "Mausam - IMD" అని సెర్చ్ చేయండి. భారత వాతావరణ శాఖ అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

ఐఫోన్ (iOS) యూజర్లు: App Storeలో "Mausam IMD" అని సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

Super El Nino: రుతుపవనాల విఫలం, 1997లో ఏమైందో గుర్తుందిగా?
Super El Nino: రుతుపవనాల విఫలం, 1997లో ఏమైందో గుర్తుందిగా?

ఈ యాప్‌లో ఉన్న స్పెషల్ ఫీచర్లు:

  • రియల్ టైమ్ అప్‌డేట్స్: ప్రస్తుతం మీ ఊరిలో ఎండ ఎంత ఉంది? వర్షం పడే ఛాన్స్ ఉందా? అన్నది వెంటనే తెలిసిపోతుంది.
  • ర్షం & వడగాల్పుల హెచ్చరికలు: తుఫానులు, పిడుగులు లేదా తీవ్రమైన ఎండల గురించి ముందే నోటిఫికేషన్లు వస్తాయి.
  • వారపు అంచనా: వచ్చే ఏడు రోజులు వాతావరణం ఎలా ఉండబోతుందో ప్లాన్ చేసుకోవచ్చు.
  • వాస్తవ అనుభూతి (Feels Like): బయట ఉష్ణోగ్రత 40°C ఉన్నా, మనకు ఎంత వేడిగా అనిపిస్తుందో (హ్యుమిడిటీ ఆధారంగా) కూడా ఈ యాప్ చెబుతుంది.
దూసుకొస్తున్న కరువు, వాతావరణ శాఖ హెచ్చరిక
దూసుకొస్తున్న కరువు, వాతావరణ శాఖ హెచ్చరిక

అలర్ట్స్ సెట్ చేసుకోండిలా.. (Step-by-Step):

యాప్ ఇన్‌స్టాల్ చేశాక, అది అడిగే 'Location' & 'Notification' పర్మిషన్లను 'Allow' చేయండి. (దీనివల్ల మీరు ఉన్న చోట వాతావరణం మారితే యాప్ వెంటనే మీకు మెసేజ్ పంపిస్తుంది).

యాప్‌లోని Settings విభాగంలోకి వెళ్లి "Rain Alert" మరియు ఇతర హెచ్చరికలను ఎనేబుల్ (On) చేసుకోండి.

ఇకపై IMD ఏదైనా రెడ్ లేదా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తే, అది నేరుగా మీ మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+