Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆధార్ కార్డుపై శుభవార్త..!!

ఆధార్ కార్డుపై శుభవార్త. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త ఆధార్ యాప్‌ను విడుదల చేసింది. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో వెల్లడించింది. ఈ కొత్త యాప్‌ ద్వారా ఆధార్ కార్డుకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా మన స్మార్ట్ ఫోన్ ద్వారానే సాగించవచ్చు. వీటిని భద్ర పర్చుకోవచ్చు. అలాగే.. ఆధార్ కార్డును షేర్ చేయడం, ఫేస్ స్కాన్ ధృవీకరించడం వంటి ప్రక్రియలు మరింత సులభతరం అవుతాయి.

ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు లేని ఫీచర్లు, సెటప్ అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ ఆధార్‌ కార్డును డిజిటల్‌గా క్యూఆర్ కోడ్ ద్వారా షేర్ చేయవచ్చు. వ్యక్తిగతంగా లేదా అధికారికం ఆధార్ కార్డు వివరాలను ఇతరులకు తెలియజేయాల్సి వచ్చినప్పుడు.. ఏ సమాచారాన్ని షేర్ చేయాలి, ఎంత వరకు షేర్ చేయాలి అనేది ఇక యూజర్ నిర్ణయించుకోవచ్చు. అనవసరమైన వివరాలను ప్రైవేట్‌గా ఉంచుకునే సౌలభ్యం ఉంది.

Stay Secure and Simplified Discover the New Aadhaar App Today

బయోమెట్రిక్ డేటాను లాక్, అన్‌లాక్ చేసే ఆప్షన్ కూడా ఈ కొత్త యాప్ లో అందుబాటులోకి వచ్చింది. యూజర్లు తమ ఆధార్ ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించారో కూడా ఇట్టే తెలుసుకోవచ్చు. ఆ వెసలుబాటు కూడా ఇందులో ఉంది. తమ ఆధార్ కార్డు వివరాలను తామే షేర్ చేశామా లేక మరెవరైనా దీన్ని షేర్ చేశారా అనేది చూసుకోవచ్చు. అంతేకాకుండా, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల వివరాలన్నింటినీ కూడా ఒకే చోట భద్రంగా ఉంచడానికి ఈ యాప్ వీలు కల్పిస్తుంది.

దీన్ని డౌన్ లోడ్ చేయాలంటే.. మొదట, ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ కు వెళ్లాలి. 'ఆధార్' అని టైప్ చేయడం ద్వారా యాప్‌ కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లో ఇన్‌స్టాల్ అయిన తర్వాత.. సెక్యూరిటీ కోసం అడిగిన సమాచారాన్ని అందులో పొందుపర్చాలి. అనంతరం ఆధార్ కార్డు నంబర్‌ను రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత.. నిబంధనలు, షరతులను ఓకే చెయ్యాలి. అనంతరం ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను పొందుపర్చాలి.

ఈ యాప్.. ఆధార్ కార్డ్ తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఉన్న ఫోన్‌లో మాత్రమే పనిచేస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కన్ఫర్మేషన్ లేకుండా ఈ యాప్ సెటప్ పూర్తి కాదు. కన్ఫర్మేషన్ తర్వాత.. ఫేస్ అథెంటికేషన్ (ఫేస్ స్కాన్) పూర్తి చేయాలి. ఇది పూర్తయిన తర్వాత యాప్ ను ఇతరులు ఓపెన్ చేయకుండా ఉండటానికి ఓ సెక్యూరిటీ పిన్‌ను సెట్ చేయండి. దీని తర్వాత ఆధార్ యాప్ పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్టవుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+