EPFO: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా ఇలా చేసుకోండి..!
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి బేసిక్ సాలరీలో 12 శాతం చందాగా చెల్లిస్తారు. మిగతా 12 శాతం కంపెనీ యాజమాన్యం చెల్లించాలి. అయితే చాలా వరకు కంపెనీల్లో డబుల్ పీఎఫ్ ఉద్యోగి జీతం నుంచి కట్ చేస్తారు. చాలా ఏళ్లుగా పీఎఫ్ చందా చెల్లిస్తుంటారు. అయితే ఆర్థికంగా అత్యవసరం ఉన్నవారు పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి కంపెనీ అనుమతి అవసరం లేదు. మీ వద్ద యూఏఎన్ నంబర్ ఉండాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన వివరాలు ఖాతాకు అనుసంధించి ఉండాలి.
పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలనుకునే వారు ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ కు వెళ్లాలి. అక్కడ ఎంప్లాయిస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత యూఏఎన్ ఆన్ లైన్ సర్వీస్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత యూఏఎన్ నంబర్ ఎంటర్ చేసి పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ కాగానే వ్యూ, మేనేజ్, అకౌంట్, ఆన్ లైన్ సర్వీస్ ఆప్షన్లు ఉంటాయి.
ఆన్ లైన్ సర్వీస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆన్ లైన్ క్లెయిమ్ పై క్లిక్ చేయాలి. అక్కడ మీరు పేరు, మీ తండ్రి పేరు, పుట్టిన రోజు, ఫోన్ నంబర్ ఆధార్, ప్యాన్ నంబర్, ఐఎఫ్ సీ నంబర్ ఉంటుంది.

మీరు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తారో.. అదే బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఫామ్ 10 సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత స్టేట్ మెంట్, క్యాన్సల్ చెక్ అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత 7 వర్కింగ్ డేస్ నుంచి 10 వర్కింగ్ డేస్ లో డబ్బులు మీ అకౌంట్ లో జమ అవుతాయి. ఒక వేళ మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాతో అనుసంధానం అయి లేకుంటే.. మేనేజ్ లోకి వెళ్లాలి. కేవైసీపై క్లిక్ చేయాలి. అక్కడ బ్యాంక్ పై క్లిక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి, మరోసారి కూడా ఖాతా నంబర్ ఎంటర్ చేయాలి. ఐఎఫ్సీ నంబర్ ఎంటర్ చేయాలి.
సడ్మిట్ చేయాలి. అప్పుడు మీకు ఆధార్ ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సడ్మిట్ చేయాలి. అప్పుడు మీ యాజమాన్యం ఒకే చేయాలి. అప్పుడు మీ ఖాతా అనుసంధానం అవుతుంది. అయితే అత్యవసరం ఉంటేనే డబ్బు విత్ డ్రా చేసుకుంటే మంచిది. ప్రస్తుతం పీఎఫ్ లో 8.25 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.












Click it and Unblock the Notifications