20 మంది చిన్నారుల్ని కిడ్నాప్ చేసి.. ఎన్ కౌంటర్ లో నిందితుడు మృతి..!

ముంబై సిటీ ఒక్కసారిగా షేక్ అయింది. 20 మంది వరకు ఉన్న చిన్నారుల్ని కిడ్నాప్ చేసిన రోహిత్ ఆర్యా అనే వ్యక్తిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ముంబైలోని పొవాయ్ ప్రాంతంలో దుండగుడు రోహిత్ ఆర్యా.. దాదాపు 20 మంది చిన్నారుల్ని స్థానిక ఆర్ఏ స్టూడియోకు తీసుకెళ్లి నిర్బంధించాడు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ముంబై పోలీసులు, ఫైర్ సిబ్బంది.. దుండగుడు రోహిత్ ఆర్యాను ఎన్ కౌంటర్ చేశారు. ఈ దాడిలో అతడు మృతి చెందాడు. నిందితుడు కిడ్నాప్ చేసిన పిల్లల వయసు 15 ఏళ్లలోపు ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఘటనపై పొవాయ్ పోలీస్ అధికారి జీవన్ సోనావానే మాట్లాడుతూ.. చిన్నారులందరినీ సురక్షితంగా కాపాడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. నిందితుడు రోహిత్ ఆర్య ప్రస్తుతం మానసికంగా సరిగా లేడని అందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. చిన్నారులను రక్షించే క్రమంలో జరిపిన కాల్పుల్లో నిందితుడు గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

Studio Siege Ends in Shots Rohit Arya s Child Hostage Horror Quashed by Mumbai Cops

పొవాయ్ ప్రాంతంలో ఓ యాక్టింగ్ స్టూడియోలో పనిచేసే రోహిత్ ఆర్య.. నాగ్ పుర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆడిషన్స్ కోసం వచ్చిన చిన్నారులను అతడు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. వాళ్లను స్టూడియో నుంచి బయటకు వెళ్లకుండా నిర్భంధించాడు. ఆ తర్వాత తాను కొంతమంది వ్యక్తులతో మాట్లాడాలి అని ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. అయితే పిల్లలను రక్షించేందుకు ముంబై పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఎట్టకేలను నిందితుడ్ని హతమార్చి పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలిలో ఎయిర్ గన్, కొన్ని కెమికల్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్పష్టం చేశారు. అయితే నిందితుడు రోహిత్ ఆర్య మతిస్థిమితం బాగాలేక ఇలా ప్రవర్తించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+