భార్యే కదా అని ముద్దు పెట్టారో.. కొంప కొల్లేరే
సాధారణంగా ముద్దులు ఆనందాన్ని పెంచుతాయని భావిస్తుంటాం. కానీ ఎక్స్‌ప్లోరేటరీ రీసెర్చ్ అండ్ హైపోథెసిస్ ఇన్ మెడిసిన్లో ప్రచురితమైన ఓ తాజా అధ్యయనం దీనికి విరుద్ధమైన ఫలితాలను వెల్లడించి సంచలనం సృష్టించింది. భాగస్వామి ముద్దుల వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది.
ఇరాన్‌లో కొత్తగా వివాహమైన 1,740 జంటలపై జరిపిన ఈ పరిశోధనలో 268 జంటలను అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ప్రతి జంటలో ఒక భాగస్వామి ఆరోగ్యంగా ఉండగా, మరొకరు నిద్రలేమి, డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్నారు. శాస్త్రవేత్తలు ఈ జంటల నుంచి నోటి మైక్రోబయోమ్ నమూనాలను, కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్) స్థాయిలను సేకరించి ఆరు నెలల తర్వాత తిరిగి పరిశీలించారు.

ఆరు నెలల తర్వాత ఆరోగ్యవంతమైన భాగస్వాములలో డిప్రెషన్, ఆందోళన, నిద్ర నాణ్యత తగ్గడం గమనించారు. ముఖ్యంగా స్త్రీలలో ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపించాయి. అనారోగ్యంతో ఉన్న భాగస్వామి నుంచి నోటిలోని బ్యాక్టీరియా ఆరోగ్యవంతమైన భాగస్వామికి చేరడం వల్ల మానసిక స్థితి, నిద్ర విధానాలలో మార్పులు సంభవించవచ్చని పరిశోధకులు సూచించారు.
నిద్రలేమితో బాధపడేవారిలో కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉండగా, ఆరు నెలల తర్వాత ఆరోగ్యవంతమైన భాగస్వాములలో కూడా కార్టిసాల్ స్థాయిలు పెరిగాయి. నోటి మైక్రోబయోటా కూర్పులో మార్పులు నిద్రలేమి తీవ్రత, కార్టిసాల్ స్థాయిలు, డిప్రెషన్, ఆందోళన పెరుగుదలతో సంబంధం కలిగి ఉన్నాయని అధ్యయనం కనుగొంది. ఈ అధ్యయనం ముద్దులు, మానసిక ఆరోగ్యం మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని వెలుగులోకి తెచ్చింది.












Click it and Unblock the Notifications