సమ్మర్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే రావాలనిపించదు.. తక్కవ బడ్జెట్ లో ఇలా చుట్టేయండి..
సమ్మర్ వచ్చేసింది. ఏప్రిల్ నెలలో ఎండలు ఇంకా మండిపోనున్నాయి. మార్చి నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏప్రిల్, మే లో ఉష్ణోగ్రతలు అధికమయ్యే అవకాశం ఉంది. మరో నాలుగు రోజుల్లో ఏప్రిల్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ లో ఎండల నుంచి దూరంగా ప్రకృతికి దగ్గరగా వెళ్లాలని ఉందా.. అలా హాయిగా చల్లని ప్రదేశాల్లో విహరించాలని ఉందా..? అయితే మీకోసం ఏప్రిల్ లో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాంతాలను తక్కువ టైమ్ లోనే చుట్టి రావచ్చు. వేసవిలో బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాలుగా ఇవి ప్రాముఖ్యత పొందాయి. అయితే ixigo.comలోని ixigo ట్రావెల్ స్టోరీస్ కథనం తెలిపిన ప్రకారం.. సమ్మర్ లో భారత్ లో సందర్శించడానికి అనువైన కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
ఇందులో కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. వేసవిలో కూర్గ్ ను అనేకమంది పర్యటకులు సందర్శిస్తుంటారు. కూర్గ్ ప్రాంతంలోని సుగంధ ద్రవ్యాలు, కాఫీ, టీ తోటలను ఏప్రిల్ నెలలో మరింతగా ఆస్వాదించవచ్చు. కూర్గ్ కొండలపై నిరంతరం కమ్ముకుని ఉండే పొగమంచు ఓ మంచి విహార ప్రదేశంగా ఉంటుంది. కూర్గ్ అత్యుత్తమ ఆతిథ్యం, సంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందింది. అలాగే కేరళలోని పాలక్కాడ్ ప్రాంతం కూడా బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా గుర్తింపు పొందింది. పాలక్కాడ్ ప్రాంతాన్ని కేరళ ముఖద్వారం అని కూడా అనేకమంది పిలుస్తుంటారు.
పశ్చిమ కనుమలలో దిగువ భాగంలో ఉన్న కేరళలోని పాలక్కాడ్ ప్రాంతం ఏప్రిల్ నెలలో భారత్ లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడి దట్టమైన అడవులు, రమణీయమైన పచ్చని కొండ ప్రాంతాలు, హడావుడి నగర జీవితం నుంచి గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇక కర్ణాటకలోని హంపి ప్రాంతం కొండల్లో దాగి ఉంటుంది. ఇక్కడ పురాతన విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఆలయాలు, రాజ భవనాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అందువల్ల ixigo.com ప్రకారం వేసవిలో భారత్ లో సందర్శించడానికి ఇది ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తోంది.

అలాగే కేరళలోని వయనాడ్ ప్రాంతం పశ్చిమ కనుమల్లో నెలకొన్న ప్రకృతి సౌందరమైన ప్రాంతం. వయనాడ్ ప్రాంతం పూర్తిగా పచ్చదనంతో కొండలతో చుట్టుకొని ఉంటుంది. పర్యటకులు వయనాడ్ ప్రశాంతతను, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, సుగంధ ద్రవ్యాల తోటల్లో విహరించే అవకాశం ఉంది. ఇక తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతం స్వచ్చమైన సరస్సులు, జలపాతాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంది. వేసవిలో పర్యటకులు సందర్శించేందుకు అత్యుత్తమమైన ప్రదేశంగా చెబుతారు. మీరూ ఈ వేసవిలో ఈ టూరిస్టు ప్రాంతాలకు ఓ లుక్ వేయండి.












Click it and Unblock the Notifications