సంజన నువ్వు సూపర్.. చిరుత పులి తోకపట్టి లాగి.. భర్తను రక్షించుకున్న ధీర వనిత
అతివలు తెగువ చూపడం రేర్.. అవును చాలా తక్కువ సందర్భాల్లో ధైర్యంగా ఉంటారు. ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. అలా మహారాష్ట్రలో ఓ వివాహిత పోరాటం చేసింది. అంటే ఇంటిలోనే.. బయటో కాదు.. చిరుతపులితో పోరాడింది. మీరు చదివేది నిజమే.. తన భర్త కోసం ఆమె చూపిన తెగువ ప్రశంసలు అందుకుంటుంది. వావ్ అని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.

ఎలుకలను చూసి ఆమడదూరం పరుగు..
కొందరు మహిళలు అయితే పిల్లులు, ఎలుకలను చూసినా భయపడుతుంటారు. కానీ ఈమె చిరుతపులితో పోరాడింది. భీకరమైన చిరుతతో పోరాడి దాని బారి నుంచి తన భర్తను కాపాడుకుంది. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లా దరోడి గ్రామంలో ఈ నెల 25వ తేదీన రాత్రి జరిగింది. భర్త కోసం చిరుతతో పోరాడిన ఆ మహిళను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

సంజన ఇలా..
గత శుక్రవారం రాత్రి సంజన అనే మహిళ తమ ఇంటి బయట చిరుతపులి ఉండటాన్ని గుర్తించింది. ఆ విషయాన్ని తన భర్త గోరఖ్ దశరథ్‌కు చెప్పింది. అతడు వెంటనే బయటకు వెళ్లాడు. అక్కడే కాచుకుని ఉన్న చిరుత గోరఖ్‌పై దాడి చేసింది. కింద పడి ఉన్న గోరఖ్ వీపు చీల్చేందుకు చిరుత ప్రయత్నించింది. ఆ విషయం గమనించిన సంజన పరుగెత్తుకుంటూ బయటకు వచ్చింది. ఆ చిరుత తోకను పట్టుకుని వెనక్కి లాగేందుకు ప్రయత్నించింది.

తోకపట్టి లాగి..
చిరుతపులి బారి నుంచి తన భర్తను విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈలోగా పెంపుడు కుక్కతో సహా అక్కడకు చేరుకున్న దశరథ్ తండ్రి కర్రలు, రాళ్లతో చిరుతను కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో గోరఖ్‌ను చిరుత వదిలింది. వెంటనే భర్తను సంజన పులి నుంచి దూరంగా లాగేసింది. చివరకు గ్రామస్థులు అంతా అక్కడకు చేరుకుని చిరుతను అక్కడి నుంచి తరిమికొట్టారు.

వావ్ అంటోన్న జనం
ఆ మహిళ చూపిన తెగువను ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు. మరొకరు అయితే ఇలా చేసే వారు కాదెమో అని అంటున్నారు. ఆమె చూపిన ధైర్య సాహసాలతోనే భర్త బతికి బట్టాడని అంతా అంటున్నారు. నిజమే ఆమె చూపిన బ్రేవ్ హార్ట్ మిగతా అతివలకు ఆదర్శంగా నిలవనుంది. మృగాళ్ల నుంచి కూడా తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేసే వీలు ఉంటుంది.












Click it and Unblock the Notifications