ఫామ్ 6 మార్పులపై సుప్రీం బిగ్ ట్విస్ట్..! సీఈసీ జ్ఞానేష్ కు ఊరట..!
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం ( SIR) సందర్బంగా కొత్త ఓటర్లను చేర్చేందుకు ఉద్దేశించిన ఫామ్ 6లో మార్పులు చేశారు. ఈ మార్పులపై కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషీ, సుఖ్ బీర్ సింగ్ సంధూ అభ్యంతరం తెలిపారు. దీంతో ఎన్నికల సంఘం వాటిని సుప్రీంకోర్టు ఆమోదంతోనే చేపట్టినట్లు వివరణ ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఫామ్ 6 మార్పులపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) దాన్ని తోసిపుచ్చింది.
ఫామ్ 6లో మార్పులు తమ ఆమోదంపై జరిగాయన్న ఈసీ వాదన సరికాదని స్వయంగా ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఈ మార్పులు ఎవరు చేశారన్న దానిపై సమగ్రంగా రికార్డులు సమర్పించాలంటూ ఆయన ఆదేశించారు. దీంతో ఫామ్ 6 మార్పులపై తప్పుడు వివరణ ఇచ్చిన ఈసీ ఇరుకునపడింది. ఈ వివాదం కొనసాగుతుండగానే ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రాజ్యాంగబద్ధమైనదని తీర్పునిచ్చిన తన తీర్పులో, ఫారం-6కు చేసిన మార్పులను తాము ఆమోదించలేదని గానీ, తిరస్కరించలేదని గానీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గతంలో ఫామ్ 6 మార్పులను తాము కేవలం ఆమోదించలేదని మాత్రమే చెప్పిన సుప్రీంకోర్టు.. అలాగని వాటిని తిరస్కరించలేదని ఇవాళ చెప్పింది. ఈసీ పనితీరులో జరిగిన అవకతవకల ఆరోపణలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై గతంలో జరిగిన విచారణలో భారత ప్రధాన న్యాయమూర్తి చెప్పిన విషయాన్నే జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి మౌఖికంగా పునరుద్ఘాటించారు. ఫారం 6కు చేసినట్లు చెబుతున్న ఏ మార్పులనూ తాము ఆమోదించలేదని ఆయన అన్నారు. తమ తీర్పులో ఫారం 6కు చేసిన అటువంటి ఏ మార్పునూ మేము ఆమోదించలేదని సీజేఐ చెప్పారని గుర్తుచేశారని పిటిషనర్ ప్రియా మిశ్రా తరఫున ఈసీ పనితీరులో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను సవాలు చేసిన న్యాయవాది నరేంద్ర మిశ్రాతో జస్టిస్ బాగ్చి అన్నారు. మొత్తం మీద ఇవాళ సుప్రీంకోర్టు మరో జడ్జి చేసిన వ్యాఖ్యలతో ఈసీకి కొంత మేర ఊరట దక్కినట్లయింది.














Click it and Unblock the Notifications
