Electoral Bonds: ఏదీ దాచకుండా అంతా బయటపెట్టేయండి-ఎస్బీఐకి సుప్రీం డెడ్ లైన్..!

ఎన్నికల బాండ్ల జారీ ద్వారా రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించిన వ్యవహారాన్ని సుప్రీంకోర్టు అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ కు ఎన్నికల బాండ్ల వివరాలు బయటపెట్టాలంటూ రెండుసార్లు గడువు విధించిన సుప్రీంకోర్టు.. మరోసారి గడువు ఇచ్చింది. అయితే ఈసారి తమ వద్ద ఇంతకు మించీ ఏదీ లేదనేలా ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు బయటపెట్టాలని అత్యున్నత న్యాయస్ధానం ఆదేశించింది.

గత ఐదేళ్లలో రాజకీయ పార్టీలు జారీ చేసిన బాండ్లు, వాటి ద్వారా వ్యక్తులు, సంస్ధల నుంచి స్వీకరించిన విరాళాలకు సంబంధించిన వివరాలు ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చినా ఎస్బీఐ మాత్రం అరకొర వివరాలే ఇచ్చింది. ఇందులో ఎన్నికల బాండ్ల వివరాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఇలాగైతే కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో మరికొంత డేటాను ఎస్బీఐ బయటపెట్టింది.

supreme court put final deadline to sbi over reveling electoral bond details

అయినా ఇంకా పూర్తి వివరాలు లభించకపోవడంపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్భంగా మార్చి 21 లోగా అంటే గురువారం లోపు ఎన్నికల బాండ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. గురువారం సాయంత్రం ఐదు గంటల్లోగా తమ దగ్గర ఇంకేమీ వివరాలు లేకుండా పూర్తి డేటా ఇవ్వాలని ఎస్బీఐ ఛైర్మన్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎస్బీఐ ఇప్పుడు తమ వద్ద ఉన్న అన్ని వివరాలు ఎన్నికల కమిషన్ కు ఇచ్చేందుకు సిద్దమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+