భార్యకు తెలియకుండానే విడాకులు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

వైవాహిక బంధం విడిపోవాలంటే ఇద్దరి సమ్మతి లేదా కనీసం ఇద్దరికీ సమాచారం ఉండటం కనీస ధర్మం. కానీ భార్యకు తెలియకుండానే భర్త విడాకులు పొందిన ఓ విచిత్రమైన కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో భర్త తన భార్యకు తెలియకుండానే కోర్టు ద్వారా విడాకులు పొందాడు. పదేళ్ల తర్వాత అసలు విషయం తెలిసిన భార్య కోర్టును ఆశ్రయించగా.. చివరకు సుప్రీంకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ, బాధితురాలికి న్యాయం చేకూర్చింది.

అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతులకు 2002లో వివాహమైంది. మనస్పర్థల కారణంగా భర్త 2009లో విడాకుల కోసం కోర్టులో కేసు వేశాడు. అయితే నోటీసు అందిన తర్వాత ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని.. తాము కలిసి ఉంటున్నామని భార్య భావించింది. కానీ భర్త కోర్టులో కేసును కొనసాగించాడు. భార్య కోర్టుకు రాకపోవడంతో 2009 నవంబర్ 30న న్యాయస్థానం ఆమె గైర్హాజరీలో విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

Supreme Court Shocking Verdict Divorce Without Wife Knowledge Declared Invalid

పదేళ్ల తర్వాత వెలుగులోకి..
తమకు విడాకులు అయ్యాయన్న విషయం భార్యకు 2019లో ఒక లీగల్ నోటీసు ద్వారా తెలిసింది. అంటే పదేళ్ల పాటు ఆమె తన భర్తతోనే కలిసి ఉంటూ, విడాకుల విషయం తెలియక మోసపోయింది. దీంతో ఆమె ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. తనకు నోటీసులు అందలేదని, భర్త తనను తప్పుదోవ పట్టించాడని వాదించింది. ట్రయల్ కోర్టు ఆమె వాదనను అంగీకరించి విడాకుల ఆర్డర్‌ను రద్దు చేసింది. కానీ,ృ భర్త హైకోర్టుకు వెళ్లగా.. హైకోర్టు భార్య అభ్యర్థనను తోసిపుచ్చింది.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరగా.. ధర్మాసనం హైకోర్టు తీర్పును రద్దు చేసింది. ప్రధానంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ (CPC) ఆర్డర్ V రూల్ 19 ను ప్రస్తావిస్తూ కోర్టు ఈ క్రింది అంశాలను వెల్లడించింది. పోస్టల్ కవర్‌పై "సమాచారం అందించినప్పటికీ తీసుకోలేదు" అని రాసి ఉంటే, దానిని నోటీసును నిరాకరించినట్లు భావించకూడదు. పోస్ట్‌మ్యాన్ చిరునామా వద్ద కేవలం సమాచారం వదిలి వెళ్లడం అంటే నోటీసు అందినట్లు కాదు. నేరుగా వ్యక్తికి అందజేయాలి లేదా వారు నిరాకరించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉండాలి. నోటీసులు సరిగ్గా అందాయా లేదా అని తనిఖీ చేయడంలో హైకోర్టు విఫలమైందని సుప్రీంకోర్టు పేర్కొంది.

భర్త తన భార్యకు తెలియకుండా ఏకపక్షంగా విడాకులు పొందడం అన్యాయమని కోర్టు స్పష్టం చేసింది. భార్య దాఖలు చేసిన అప్పీలును స్వీకరిస్తూ, విడాకుల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి పరిశీలించాలని ఆదేశించింది. భార్యకు సమాచారం లేకుండా జరిగిన విడాకులు చెల్లవని తేల్చి చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+