పెద్దనోట్ల రద్దు - సుప్రీం ధర్మాసనం తీర్పు..!!

దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన పెద్దనోట్ల రద్దుపై సుప్రీం రాజ్యాంగ ధర్మానసం తీర్పు వెలువరించనుంది. 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంలో 58 పిటీషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ అంశంపై జస్టిస్ ఎస్‌ నజీర్ సారధ్యంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ ఇవాళ తీర్పు ఇస్తుంది. శీతాకాలం సెలవులు తరువాత ప్రారంభం అవుతున్న కోర్టు ఇవ్వనున్న ఈ తీర్పు పైన ఉత్కంఠ నెలకొంది.

జస్టిస్ నజీర్‌తోపాటూ ఈ ధర్మాసనంలో గవాయ్, నాగరత్న, ఎఎస్ బొపన్న, వి.రామసుబ్రమణియన్‌లు సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ నజీర్ జనవరి 4న రిటైర్ అవుతున్నారు. ఆయన పదవీ విరమణకు ముందే తీర్పు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ ప్రముఖ నేత..న్యాయవాది చిదంబరం తన వాదనలను బలంగా వినిపించారు. చిదంబరం పిటిషనర్ల తరపున వాదిస్తూ.. నోట్ల రద్దు విధానాన్ని విమర్శించారు. ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియ లోపభూయిష్టంగా ఉన్నాయని, లీగల్ టెండర్‌కు సంబంధించిన ఎలాంటి తీర్మానాన్ని ప్రభుత్వం స్వయంగా ప్రారంభించలేదని వాదించారు. ఇది అత్యంత దారుణమైన నిర్ణయాల ప్రక్రియ అని పేర్కొన్న మాజీ ఆర్థిక మంత్రి.. ఈ ప్రక్రియ దేశంలోని న్యాయ పాలనను అపహాస్యం చేసిందని అన్నారు. ఇక ప్రభుత్వం తరపున భారత అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తన వాదనలను వినిపించారు.

 Supreme Court to give verdict on pleas challenging demonetisation policy today

ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. తన వాదనలను వినిపించారు. ఆర్థిక వ్యవస్థలో ఒక వైపు పెద్ద ప్రయోజనాలు, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు సాటిలేనివని అన్నారు. నిర్దేశిత లక్ష్యాలను అమలు చేయడంతో పెద్ద నోట్ల రద్దు విఫలమైంది. అదే సమయంలో అనవసరమైన కష్టాలను తెచ్చిపెట్టిందనడం అతి పెద్ద అపోహ అని అటార్నీ జనరల్ పేర్కొన్నారు.2016లో కేంద్ర పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను తమకు సమర్పించాలంటూ గత డిసెంబర్ 8న కేంద్రం, ఆర్బీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐకి కేంద్రం రాసిన లేఖలు..ఆర్బీఐ నిర్ణయాలతో పాటుగా నోట్ల రద్దు ప్రకటనలకు సంబంధించి పైళ్లను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. కాగా, బెంచ్‌లోని ఐదుగురు సభ్యుల్లో నోట్ల రద్దును ఎంత మంది సమర్థిస్తారు..ఎంతమంది వ్యతిరేకిస్తున్నారనేది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+