Ratan Tata: 11 వేల వజ్రాలతో రతన్ టాటా పోర్ట్రెయిట్.. ఇదే సరైన నివాళి..

Diamonds Ratan Tata: దేశీయ పారిశ్రామిక వేత రతన్ టాటా గతవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై చాలా మంది తమకు తోచినట్లుగా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. కొందరు సైకత శిల్పాలను తయారు చేయగా, ఇప్పుడు ఒక వినూత్న నివాళి గురించి తెలుసుకుందాం..

సూరత్ కి చెందిన ఒక స్వర్ణకారుడు లెజెండరీ వ్యాపారవేత్త రతన్ టాటాకు ఏకంగా 11000 వజ్రాలతో చిత్రాన్ని తయారు చేశారు. రత్నం లాంటి 86 ఏళ్ల రతన్ టాటా చిత్రాన్ని వజ్రాలతో తయారు చేయటం ఇంటర్నెట్ లో పెద్ద సంచలనంగా మారింది. టాటా తన జీవితకాల నిబద్ధతతో సమాజ సంక్షేమాన్ని ప్రతిబింబిస్తూ అద్భుతమైన కళాకృతిని సూరత్‌కు చెందిన ఒక ఆభరణాల వ్యాపారి రూపొందించారు. టాటాపై మిరుమిట్లు గొలిపే డైమండ్స్ పోర్ట్రెయిట్ ప్రగాఢమైన అభిమానాన్ని, శాశ్వత ప్రభావాన్ని హైలైట్ చేయటాన్ని మిలియన్ల మంది వీక్షించారు.

Surat Man made Ratan Tata portrait with 11000 diamonds Video Went viral

రతన్ టాటా మరణించిన తర్వాత ఇంటర్నెట్ ద్వారా దేశ ప్రజలు తమదైన శైలిలో భావోద్వేగ పూరిత పోస్టుల ద్వారా ఆయపై ఉన్న అభిమానాన్ని పంచుకున్నారు. డైమండ్స్ పోర్ట్రెయిట్ నిజమైన కళాఖండం, అతను వదిలిపెట్టిన వారసత్వం అని ఒక ఇంటర్నెట్ యూజర్ పేర్కొన్నారు. రతన్ టాటా ఎల్లప్పుడూ వ్యక్తులకు మెుదటి స్థానం ఇచ్చేవారని మరొక యూజర్ పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఇన్‌స్టంట్ బాలీవుడ్ ద్వారా ఈ వీడియో పంచుకోబడింది. రతన్ టాటా మరణించిన తరువాత దుఃఖం మధ్య, ఒక విశేషమైన నివాళి ఆన్‌లైన్‌లో చాలా మంది హృదయాలను దోచుకుంటోంది.

86 ఏళ్ల రతన్ టాటా బుధవారం నాడు ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న టాటా చికిత్స పొందుతూ రాత్రి 11:30 గంటలకు మరణించారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల వరకు అందరిలోనూ దుఃఖం వెల్లువెత్తింది. భారతదేశ పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన అపారమైన కృషికి పేరుగాంచిన, టాటా మరణం తీవ్ర శూన్యతను మిగిల్చింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం దివంగత రతన్ టాటా గౌరవార్థం మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీ పేరును మార్చనున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+