సుశాంత్ మరణం... ఆ 'పెయింటింగ్‌' భయపెట్టిందా... చేతిలో రుద్రాక్షతో మంత్రాలు...

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసును సుప్రీం కోర్టు సీబీఐ సిట్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ కేసును విచారించిన ముంబై పోలీసులు సీబీఐకి సహకరించనున్నారు. కేసు విచారణలో రికార్డ్ చేసిన వాంగ్మూలాలు,సాక్ష్యాలన్నింటినీ సీబీఐకి అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసుల విచారణకు సంబంధించి ఇండియా టుడే ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం... సుశాంత్ మరణించిన జూలై 14 నుంచి జులై 28 వరకు ముఖ్యంగా ఏడు అంశాల ఆధారంగా పోలీసులు ఈ కేసును విచారించారు. ఈ ఏడు అంశాల్లో సుశాంత్ ఓ పెయింటింగ్‌ని చూసి చాలా డిస్టర్బ్ అయినట్లుగా పేర్కొన్న అంశం కీలకంగా కనిపిస్తోంది. ముంబై పోలీసులు మొత్తం 56 మంది వాంగ్మూలాలు సేకరించగా... ఇందుకోసం దాదాపు 300గంటలు వెచ్చించారు.

పంచనామా...

పంచనామా...

పంచనామా ప్రకారం... సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన గదిలో బెడ్ నుంచి సీలింగ్ ఫ్యాన్ 5.11 అడుగుల ఎత్తులో ఉంది. సుశాంత్ ఎత్తు 5.10 అడుగులు. ఫ్యాన్‌కు ఉరేసుకున్న తర్వాత సుశాంత్ బెడ్ వైపుగా వాలిపోయాడు. సంఘటనా స్థలంలో బాత్ రోబ్ బెల్ట్‌ను కూడా గుర్తించారు. మొదట దాన్ని ఉపయోగించే సుశాంత్ ఉరివేసుకునేందుకు ప్రయత్నించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆటోస్పై ప్రకారం... సుశాంత్ శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఘర్షణపడినట్లుగా గానీ,గాయపడినట్లుగా గానీ ఎలాంటి ఆనవాళ్లు లేవు. అసహజ మరణాల్లో జరిగే వీర్య విసర్జనను గుర్తించారు. సుశాంతో పొట్టలో 200మి.లీ దానిమ్మ జ్యూస్‌ను గుర్తించారు. అది తప్ప ఏ ఆహార పదార్థాలు ఆరోజు అతను సేవించలేదు.

నెపోటిజం...

నెపోటిజం...

సుశాంత్ మృతి కేసులో ముంబై పోలీసులు విచారణ సాగించిన అంశాల్లో నెపోటిజం ఒకటి. దీనికి సంబంధించి ఫిలిం మేకర్స్ ఆదిత్యా చోప్రా,సంజయ్ లీలా భన్సాలీ,మహేష్ భట్,ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో,అపూర్వ మెహతా తదితరుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. కరణ్ జోహార్‌ను కూడా తన వాంగ్మూలం నమోదు చేసేందుకు పిలిచారు. కానీ అదే సమయంలో రియా చక్రవర్తి,ఆమె కుటుంబ సభ్యులు,సుశాంత్ సిబ్బంది ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో అతని వాంగ్మూలాన్ని వాయిదా వేశారు. సుశాంత్‌ ప్రొఫెషనల్ కెరీర్‌తో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న దాదాపు అందరి వాంగ్మూలాలను రికార్డు చేశారు. బాలీవుడ్ గ్యాంగ్ నిజంగానే సుశాంత్‌ను టార్గెట్ చేసిందా అన్నది తేల్చేందుకే ఇంతమంది స్టేట్‌మెంట్స్ నమోదు చేశారు.

నెగటివ్ పబ్లిసిటీ

నెగటివ్ పబ్లిసిటీ

జూన్ 12న ఓ బాలీవుడ్ న్యూస్ పోర్టల్‌లో సుశాంత్‌పై ఒక నెగటివ్ కథనం ప్రచురితమైంది. సుశాంత్ స్నేహితులు,అతని సిబ్బంది అభిప్రాయం ప్రకారం... అలా ఎప్పుడు సుశాంత్‌పై నెగటివ్ కథనం వచ్చినా... అతనిపై తీవ్ర ప్రభావం పడేది. కొంతమంది కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీసి కెరీర్‌ను నాశనం చేసేందుకు ఇలా కట్టు కథనాలు రాస్తున్నారని సుశాంత్ వాపోయేవాడు. ఈ నేపథ్యంలో నలుగురైదుగురు జర్నలిస్టులను పోలీసులు విచారించి వారి వాంగ్మూలం నమోదు చేశారు. ఇందులో జర్నలిస్ట్,సీనియర్ ఫిలిం క్రిటిక్ రాజీవ్ మసంద్ కూడా ఒకరు.సుశాంత్‌పై మసంద్ కూడా కొన్ని నెగటివ్ కథనాలు రాశారు. అయితే తన వాంగ్మూలంలో మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పారు. నిరాధారిత కథనాలు తాను ఎప్పుడూ రాయలేదన్నారు.

ఆర్థిక ఇబ్బందులున్నాయా...?

ఆర్థిక ఇబ్బందులున్నాయా...?

సుశాంత్ బిజినెస్ మేనేజర్స్,చార్టెడ్ అకౌంటెంట్లను కూడా విచారించి బ్యాంక్ రికార్డుల గురించి తెలుసుకున్నారు. సుశాంత్ బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.4.5కోట్లు ఉన్నాయి. అప్పటికీ అతనికి ఇంకా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. రుమీ జాఫ్రీతో సినిమా కమిట్ అయినందుకు రూ.15కోట్లు రావాల్సి ఉంది. లాక్ డౌన్ ఎత్తేశాక ఆ సినిమా ప్లాన్ చేశారు. కాబట్టి సుశాంత్‌కు ఎలాంటి ఆర్థిక కష్టాలు లేవని పోలీసులు తేల్చారు. అయితే ఖర్చులు తగ్గించుకోవాలని పలుమార్లు సుశాంత్ అనేవాడని అతని సిబ్బంది చెప్పారు.

శత్రువులు ఎవరైనా ఉన్నారా...?

శత్రువులు ఎవరైనా ఉన్నారా...?

సుశాంత్ సన్నిహితులు,స్నేహితులు,కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా పోలీసులు రికార్డు చేశారు. వాళ్లెవరూ సుశాంత్‌‌కు శత్రుత్వం,కలహాలు లాంటివి ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు. కొన్ని సోషల్ మీడియా కథనాలు ఓ అగ్రశ్రేణి బాలీవుడ్ నటుడితో సుశాంత్‌కు శత్రుత్వం ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ... అందులో నిజం లేదని పోలీసులు విచారణలో తేల్చారు.

మాజీ మేనేజర్ దిశతో కనెక్షన్...?

మాజీ మేనేజర్ దిశతో కనెక్షన్...?

జూన్ 9న దిశా సాలియన్ ఆత్మహత్యకు పాల్పడ్డ రోజు... ఆమె సుశాంత్ మాజీ మేనేజర్ అంటూ వచ్చిన కథనాలు చూసి అతను ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నిజానికి దిశాను సుశాంత్ కేవలం ఒక్కసారి మాత్రమే కలిశాడు. సుశాంత్ అకౌంట్స్ చూసుకునే ఓ కంపెనీలో ఆమె ఉద్యోగిగా పనిచేశారు. సుశాంత్‌కు అప్పుడప్పుడు ఫోన్ ద్వారా మెసేజ్‌లు చేసేవారు. దిశా బాస్ ఉదయ్ సింగ్ గౌరితో మాత్రమే సుశాంత్ డైరెక్ట్‌గా టచ్‌లో ఉండేవాడు. దిశ ఆత్మహత్యకు పాల్పడిన రోజు... ఆమె ఎవరంటూ తన న్యాయవాదికి సుశాంత్ మెసేజ్ కూడా చేశాడు.

ఆరోగ్య సమస్యలు

ఆరోగ్య సమస్యలు

సుశాంత్ కొంతకాలంగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. సుశాంత్ బైపోలార్ డిసార్డర్‌తోనూ బాధపడుతున్నట్లు అతని సైకోథెరపిస్ట్ ఒకరు చెప్పారు. నవంబర్ 2019 నుంచి జూన్ 2020 వరకూ సుశాంత్‌కు చికిత్స అందించిన నలుగురు సైక్రియాటిస్టుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. అతని మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. ఆత్మహత్యకు కొద్ది రోజుల ముందు సుశాంత్ ట్రీట్‌మెంట్ తీసుకోవడం ఆపేసినట్లు అతని సిబ్బంది చెప్పారు. అంతేకాదు,సుశాంత్ తననేవో వెంటాడుతున్నట్లు చెప్పేవాడని... దాంతో కొన్నిరోజులు వాటర్ స్టోన్స్ క్లబ్‌కు కూడా మారాడని చెప్పారు. సుశాంత్ బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌లో వాటర్ స్టోన్ క్లబ్ చెల్లింపులు కూడా ఉన్నాయి.

 ఆ పెయింటింగ్‌ భయపెట్టిందా...

ఆ పెయింటింగ్‌ భయపెట్టిందా...

అక్టోబర్,2019లో సుశాంత్,తానూ కలిసి ఇటలీలోని ఫ్లోరెన్స్‌కి వెళ్లామని రియా తన వాంగ్మూలంలో వెల్లడించారు. అప్పుడే మొదటిసారి సుశాంత్ మానసిక సమస్య గురించి తనకు తెలిసిందన్నారు. ఫ్లోరెన్స్‌లో దాదాపు 600 ఏళ్ల పురాతనమైన ఓ హోటల్లో తాము బస చేసినట్లు చెప్పారు. ఆ హోటల్లో గదులు చాలా పెద్దవిగా ఉండేవని,గోడలకు పెయింటింగ్స్ ఉండేవని చెప్పారు. అలా ఓ పెయింటింగ్‌లో ఓ రాక్షసి తన సొంత బిడ్డనే మింగేస్తున్న చిత్రం ఉందన్నారు. ఓరోజు వేరే గదిలో తన సోదరుడితో ఉన్న రియా... అనుకోకుండా సుశాంత్ గదికి వెళ్లేసరికి... అక్కడతను చేతిలో రుద్రాక్షతో ఆ పెయింటింగ్ ముందు నిలబడి ఏవో మంత్రాలు జపిస్తున్నాడు.ఏం జరిగిందని రియా సుశాంత్‌ని అడగ్గా... అతనేమీ చెప్పలేకపోయాడు. అదంతా వట్టి భ్రమ అని రియా సుశాంత్‌కు నచ్చజెప్పింది. అయితే ముంబైకి తిరిగొచ్చాక సుశాంత్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. అరవడం,కేకలు పెట్టడం,ఏడ్వడం చేసేవాడు. ఇదంతా చూసి రియా కూడా డిప్రెషన్‌లోకి వెళ్లింది.

Recommended Video

    Sonu Sood Helps A Tribal Girl In Chhatisgarh
    సెల్‌ఫోన్ డేటా

    సెల్‌ఫోన్ డేటా

    సుశాంత్ ఫోన్‌ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి ఎందుకు పంపించలేదన్న విమర్శలు ముంబై పోలీసులు ఎదుర్కొన్నారు. అయితే ఆ ఫోన్‌ని అధునాతన టెక్నాలజీతో కూడిన మహారాష్ట్ర సైబర్ ల్యాబ్‌కి పంపించారు. అక్కడ సుశాంత్ ఫోన్‌లోని మెసేజ్‌లు,కాల్స్ విశ్లేషించినప్పటికీ అనుమానాస్పదంగా ఏమీ లేవు. డిలీట్ మెసేజ్‌లను కూడా పరిశీలించారు. కాగా,ఈ కేసును విచారించేందుకు త్వరలోనే సీబీఐ టీమ్ ముంబై రానుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+