నిద్రపోతున్న భార్యను గొడ్డలితో నరికి స్పాట్ లో చంపేసిన భర్త, పోలీస్ స్టేషన్ కు వెళ్లి ?
వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. ఇదే సందర్బంలో భర్త అనారోగ్యానికి గురైనాడు. తరువాత దంపతుల మధ్య లేనిపోని గొడవలు మొదలైనాయి. తన భార్య తనను పట్టించుకోవడంలేదని, అనారోగ్యానికి గురైనా తనను నిర్లక్షం చేసి తన భార్య ఏదో చేస్తోందని అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా నరికి చంపేశాడు.
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా బళ్లారిలో భార్య తనను సరిగా పట్టించుకోవడం లేదన్న కారణంతో నిద్రిస్తున్న భార్యను ఆమె భర్త గొడ్డలితో గొంతు నరికి హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకాలోని బాలకుండి గ్రామంలో నిద్రపోతున్న భార్య ఆమె భర్త చేతిలో హత్యకు గురి కావడంతో ఆప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు, మహిళ కుటుంబ సభ్యులు హడలిపోయారు.

మైబునా, రసూల్ సాబ్ అనే ఇద్దరికి చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత భర్త రసూల్ సాబ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతను అనారోగ్యంపాలైనాడు. భార్య మైబునా ఆమె భర్త రసూల్ సాబ్ ఆలనాపాలనా చూసింది. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రసూల్ సాబ్ చివరికి డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చింది.
వీటన్నింటిని తట్టుకుని భర్త రసూల్ సాబ్ ను పోషించుకోవడానికి భార్య మైబునా ఆమె పొలంలో పని చేసేది. అయితే ఇంట్లో భార్య మైబునా తనను పట్టించుకోవడం లేదనే, బయట ఎక్కువగా తిరుగుతోందనే కోపంతో ఆమె భర్త రసూల్ సాబ్ రగిలిపోయాడు. తన అనారోగ్యాన్ని కుంటిసాకుగా తీసుకుని తన భార్య ఎక్కువగా బయట తిరుగుతోందని, ఆమెకు అక్రమ సంబంధం ఉందని భర్త రసూల్ సాబ్ అనుమానం పెంచుకున్నాడు. భార్య మైబునాను చంపేయాలని రసూల్ సాబ్ డిసైడ్ అయ్యాడు.

మైబునా నిద్రిస్తున్న సమయంలో గొడ్డలి తీసుకుని ఆమె మెడ మీద దారుణంగా నరకడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్య మైబునాను దారుణంగా హత్య చేసిన రసూల్ సాబ్ తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. తనను నిర్లక్ష్యం చేయడం వల్లే తన భార్య మైబునాను హత్య చేసినట్లు నిందితుడు రసూల్ సాబ్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కష్టపడి పనిచేసి భర్త రసూల్ సాబ్ ను పోషించడం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మైబునాను దారుణంగా హత్య చేసిన కిరాతకుడు రసూల్ సాబ్ ను కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications