చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: జైల్లో ఇలా.., రైల్వే స్టేషన్‌ని దత్తత తీసుకున్న కాలేజీ

|
Google Oneindia TeluguNews

చెన్నై: నుంగంబక్కం రైల్వేస్టేషన్‌లో ఇన్ఫోసిస్ సాఫ్టువేర్ ఇంజినీర్ స్వాతిని హత్య చేసిన నిందితుడు రామ్ కుమార్ జైలులో సైలెంట్‌గా ఉంటున్నాడు. జైలులో ఉంటున్న అతను ఎవరితోను ఎక్కువగా మాట్లాడటం లేదని తెలుస్తోంది.

రైల్వే స్టేషన్‌ను దత్తత తీసుకున్న కళాశాల

స్వాతి హత్య అనంతరం నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌ను దత్తత తీసుకొని మోడల్‌ స్టేషన్‌గా మార్చేందుకు లయోలా కాలేజీ ముందుకొచ్చింది. రైల్వే స్టేషన్‌కు ఒక వైపు లయోలా కళాశాల, మరోవైపు చూలైమేడు ప్రాంతం ఉంది.

అమాయకుడ్ని: ఇన్ఫోసిస్ హత్య టెక్కీపై రామ్ కుమార్ యూటర్న్ అమాయకుడ్ని: ఇన్ఫోసిస్ హత్య టెక్కీపై రామ్ కుమార్ యూటర్న్

రైల్వే స్టేషన్ సమీపంలో మార్కెట్లు, దుకాణాలు లేకపోవడంతో రైళ్లు వచ్చే సమయాల్లో మాత్రమే జనసంచారం ఉంటుంది. మిగతా సమయాల్లో నిర్మానుష్యంగా ఉంటుంది. అధికారులు మరిన్ని భద్రతా చర్యలు చేపడుతున్నారు.

swathi murder case: ramkumar spends his jail life silently

ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు లయోలా కళాశాల ముందుకు వచ్చింది. ఏడాది క్రితం కళాశాల అధికారుల సమావేశంలో కళాశాల కార్యదర్శి అమృతం, ప్రిన్సిపాల్‌ స్వామి, పౌరసంబంధాల అధికారి అంతోనిస్వామి ఈ పథకం గురించి చర్చించారు.

అయితే పథకాన్ని అమలుపరచడానికి ముందు స్వాతి హత్య జరిగింది. దీంతో రైల్వే స్టేషని దత్తత పథకాన్ని వెంటనే అమలుపరచాలని కళాశాల నిర్వాహకులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన రైల్వే అధికారులతో చర్చలు జరుగుతున్నాయి.

రైల్వే స్టేషన్లో... సీసీ కెమెరాలు అమరుస్తారు. కెమెరా ఫుటేజీలు.. పోలీస్‌, రైల్వే, కళాశాల నిర్వాహకుల నియంత్రణలో ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు షిఫ్ట్‌ విధానంలో కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద విద్యార్థుల బృందాలు రైల్వే స్టేషన్లో భద్రతను చేపడతాయి. యాణికులకు హెల్ప్‌లైన్ నెంబరు ప్రత్యేకంగా ప్రకటిస్తారు.

English summary
Swathi murder accused Ramkumar is spending his jail life silently. He is not talking to anybody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X