స్టార్ హీరో దళపతి విజయ్ కి అన్నామలై వార్నింగ్, కేంద్రం గురించి, సీఏఏ గురించి మాట్లాడే ముందు?

తమిళనాడు రాజకీయాల్లో ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై జోరు చాలా బలంగా ఉంది, లోక్‌సభ ఎన్నికలకు ముందు దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాష్ట్రంలో బీజేపీ ప్రకంపనలు సృష్టించడానికి సిద్దం అవుతోంది. లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్న తరుణంలో తమిళ నటుడు దళపతి విజయ్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది.

హీరో విజయ్ చేసిన ప్రకటనకు ఇప్పుడు తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై వార్నింగ్ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు రంగం సిద్దం అవుతున్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య భారీగా పోటీ నెలకొని ఉంటుందని అంచనా వేశారు. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఈసారి బీజేపీ జెండా పాతడం ఖాయమని బీజేపీ హైకమాండ్ నమ్మకంగా ఉంది.

Tamil Nadu BJP chief Annamalai gave a warning to Tamil star hero Thalapathy Vijay

ఇదే సమయంలో హీరో విజయ్, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది. హీరో విజయ్‌కి అన్నామలై ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మీరు కొత్త పార్టీ పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీకు, మీ పార్టీకి రాజకీయ సలహాదారులు అవసరం అంటూ బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై హీరో విజయ్ కి ఓ సలహాపారేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా నటుడు విజయ్ ఇటీవల సంచలన ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఇప్పుడు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై హీరో విజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్నామలై ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ అన్నామలై ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏంటి అని అందరూ ఆరా తీశారు.

హీరో దళపతి విజయ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. దీని ద్వారా వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. తన కొత్త రాజకీయ పార్టీకి తమిళగ వెట్రి కళగం అని పేరు పెట్టిన నటుడు విజయ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీఏఏకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇదే విషయంపై ఇప్పుడు అన్నామలై స్పందిస్తూ ఒక్క మాటమాట్లాడి మీరు తమిళనాడులో రాజకీయాలు చేయలేరు అని అన్నామలై అన్నారు.

మీరు ముందు మంచి రాజకీయ సలహాదారులను పెట్టుకోండి అంటూ హీరో విజయ్ కి బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ఓ సలహా ఇచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు దళపతి విజయ్, అన్నామలై మధ్య పోరు మెల్లగా మొదలైనట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హీరో విజయ్, అన్నామలైల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అందరి దృష్టిని ఆకర్షించింది. అన్నామలై వార్నింగ్, సలహాలపై హీరో దళపతి విజయ్ ఎలా స్పందిస్తారు? అని వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+