MK Stalin: రోడ్డు పక్కన సడన్‌గా కారును ఆపిన తమిళనాడు సీఎం..అక్కడికక్కడే సంతకం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. పరిపాలనపై తనదైన ముద్ర వేస్తోన్నారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో రాష్ట్ర పగ్గాలను అందుకున్న ఆయన తొలి రోజు నుంచే సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోన్నారు. కరోనా వైరస్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అయిదు లక్షల రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని ప్రకటించారాయన. అలాగే- తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించారు.
తాజాగా- మరోసారి వార్తల్లోకెక్కారు. రోడ్డు పక్కన నిల్చుని తనను కలవడానికి ప్రయత్నించిన ఓ మహిళను చూసి ఏకంగా తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. ఆ మహిళ నుంచి వినతిపత్రాన్ని అందుకున్నారు. ఆమె బాధలను విన్నారు. అక్కడితో ఆగలేదు. ఆమె అందజేసిన వినతిపత్రంపై అక్కడికక్కడే సంతకం చేశారు. దాన్ని అమలు చేయాలంటూ అధికారులను ఆదేశించారు కూడా. ఆ తరువాతే తన కారును ముందుకు పోనిచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మహిళ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆసుపత్రికి అయ్యే ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత ఆమెకు లేదు.

తన ఇంటి మీదుగా ముఖ్యమంత్రి వెళ్తోన్నారనే విషయాన్ని తెలుసుకున్న ఆమె ముఖ్యమంత్రికి తన ఆవేదనను తెలియజేయాలనుకున్నారు. ఓ వినతిపత్రాన్ని సిద్ధం చేసుకున్నారు. స్టాలిన్ కాన్వాయ్ వెళ్తోన్న సమయంలో రోడ్డు పక్కనే నిల్చున్నారు. స్టాలిన్ కూర్చున్న కారు అటు వైపు దూసుకుని రాగానే.. దాని వైపు మెళ్లిగా నడుచుకుంటూ వెళ్లారు. ఆమె తన వైపే వస్తోన్న విషయాన్ని గమనించిన స్టాలిన్.. రోడ్డు పక్కన కారును నిలిపివేశారు. ఆమె నుంచి వినతిపత్రాన్ని స్వీకరించారు. ఆమె చెప్పేది సావధానంగా విన్నారు. అనంతరం ఆ వినతిపత్రంపై సంతకం చేశారు. దాన్ని సంబంధిత అధికారులకు అందజేయాలని మళ్లీ ఆమె ఇచ్చారు.
சாலையில் ஒரு ஓரமாக ஒரு பெண்மணி எதற்காக காத்திருக்கிறார் என பாருங்களேன்..#முத்துவேல்கருணாநிதிஸ்டாலின்
— Kumaran Karuppiah (@2kkumaran) June 13, 2021
இவர் வேற மாதிரி 😍 pic.twitter.com/EMgbuFiIUo












Click it and Unblock the Notifications