Udayanidhi: నేను క్రిస్టియన్, ఇలా అంటే కొందరికి కడుపు మంట, సీఎం కొడుకు సంచలన కామెంట్స్ !

చెన్నై: నేను క్రిస్టియన్, నేను క్రిస్టియన్ అని ఇలాఅంటే చాలా మందికి కడుపుమంటగా ఉంటుంది, ఉంటే ఉండనివ్వండి, అలాంటి వాళ్లకు మేము ఏమి సమాధానం చెబుతామని, మనం అందరూ ఒక్కటే అని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ కుమారుడు. తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం స్టాలిన్ ముందు చూపుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతిపేదవాడికి అందుతున్నాయని, అందుకే దేశంలో నెంబర్ వన్ సీఎంగా స్టాలిన్ నిలిచారని సర్వేలు చెబుతున్నాయని మంత్రి ఉదయానిధి స్టాలిన్ గుర్తు చేశారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గోన్న ఉదయానిధి స్టాలిన్ లోక్ సభ ఎన్నికల వియంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా అంటే కడుపు మంట అలాగే ఉంటుంది

ఇలా అంటే కడుపు మంట అలాగే ఉంటుంది

చెన్నైలోని హరపురం నియోజకవర్గంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉదయానిధి మాట్లాడుతూ తాను క్రిస్టియన్ అని అన్నారు. ఇలా నేను మాట్లాడడం వల్ల కొంత మంది బాధపడతారని, వారికి కడుపు మండుతోందని ఉదయానిధి అన్నారు. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరగబోతున్నాయి ఉదయానిధి గుర్తు చేశారు.

ద్రవిడ ప్రభుత్వం అంటే ?

ద్రవిడ ప్రభుత్వం అంటే ?

ఇప్పుడు కొందరికి హఠాత్తుగా అనుమానం వచ్చింది అని ఉదయానిధి అన్నారు. ద్రావిడ ప్రభుత్వ సిద్దాంతం ఏమిటని అడుగుతున్నారు.. దీనికి సమాధానం చెబుతాను. హిందు మతానికి చెందిన సంక్షేమ శాఖ మంత్రి శేఖర్‌బాబు ఇప్పుడు క్రిస్మస్ సందర్బంగా క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు అందిస్తున్నారు. ద్రవిడ ప్రభుత్వ సిద్దాంతం అంటే నిదర్శనం మంత్రి శేఖర్ బాబు అని గుర్తు చేశారు. మంత్రి శేఖర్ బాబు హిందువుల కార్యక్రమాలు, క్రైస్తవ కార్యక్రమాలు, ఇస్లామిక్ కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నాడని ఇదే మా ప్రభుత్వ సిద్దాంతం అని ఉదయానిధి స్టాలిన్ చెప్పారు.

పెరియార్, అన్నా, కరుణానిధి ఏం చెప్పారంటే ?

పెరియార్, అన్నా, కరుణానిధి ఏం చెప్పారంటే ?

నేను క్రైస్తవుడిని, దీనినే సోషల్ ఫైనాన్షియల్ గవర్నెన్స్ అంటారని ఉదయానిధి స్టాలిన్ అన్నారు. పెరియార్‌, అన్నా, కరుణానిధి, ప్రొఫెసర్‌ అన్బజగన్‌ ఇలానే చెప్పారని ఉదయానిధి స్టాలిన్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ ఇప్పుడు ఈ తరహా పాలన సాగిస్తున్నారని ఉదయానిధి స్టాలిన్ అన్నారు.

నేను లయోలా కాలేజ్ స్టూడెంట్

నేను లయోలా కాలేజ్ స్టూడెంట్

నేను కూడా క్రైస్తవుడిని, నన్ను నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. నేను ఎగ్మోర్‌లోని క్రిస్టియన్ స్కూల్‌లో చదివాను, అలాగే చెన్నైలోని లయోలా కాలేజీలో చదివాను. అదే విధంగా, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందుకే నేను క్రైస్తవుడు అని తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలతో సంక్షేమ సాయం ఆగదు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరం పొడవునా కొనసాగుతాయి. పేద ప్రజలను ఆదుకోవడం పని మా మొదటి లక్ష్యం అని మంత్రి ఉదయానిధి స్టాలిన్ అన్నారు.

గత ఏడాది చెన్నైలో ఏమైయ్యింది ?

గత ఏడాది చెన్నైలో ఏమైయ్యింది ?

గత సంవత్సరం రాజధాని చెన్నైలో వర్షాలు కురిసినప్పుడు, వర్షం నీరు రోడ్లు మీద నిలిచిపోయాయి. ఇది గత ప్రభుత్వం నిర్లక్షం ఫలితమే అని, అందుకే చెన్నై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని. అయితే ఈ ఏడాది మందాస్ తుపాను కారణంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, అందుకు అహర్నిశలు కృషి చేసిన మంత్రి శేఖర్‌బాబు, చెన్నై మేయర్ ప్రియాలకు కృతజ్ఞతలు అని మంత్రి ఉదయానిధి అన్నారు.

దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం, నెంబర్ వన్ సీఎం

దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం, నెంబర్ వన్ సీఎం

ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ కృషి, పట్టుదల, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ఇండియా టుడే సర్వేలో మన దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తమిళనాడు గుర్తింపు తెచ్చుకుందని మంత్రి ఉదయానిధి స్టాలిన్ అన్నారు. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి స్టాలిన్ అలుపెరగని కృషి, తమిళనాడులో తీసుకొచ్చిన పథకాలు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలను డీఎంకే తమిళనాడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

లోక్ సభ ఎన్నికలకు సిద్దం కావాలి

లోక్ సభ ఎన్నికలకు సిద్దం కావాలి

వచ్చే ఏడాదిలోగా పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయని దాన్ని ఎదుర్కొనేందుకు మనం ఇప్పుడే సిద్ధం కావాలని డీఎంకే కార్యకర్తలకు మంత్రి ఉదయానిధి స్టాలిన్ పిలుపునిచ్చారు. చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది. డాన్ పాస్కో ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి ఉదయనిధి క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. మంత్రి ఉదయనిధి సుమారు 2 వేల కుటుంబాలకు కొత్త బట్టలు, కిరాణా సామాను సహా బహుమతులు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మంత్రి శేఖర్ బాబు, చెన్నై మేయర్ ప్రియా తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+