పవర్ స్టార్ ను అరెస్టు చేసి తీసుకురండి: కోర్టు ఆదేశం, మొత్తం చీటింగ్ కేసులే, విచారణకు డుమ్మా !

ప్రముఖ తమిళ నటుడు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ను అరెస్ట్‌ చేసి హాజరుపరచాలని తమిళనాడులోని దురైయూర్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ను అరెస్ట్‌ చేసి హాజరుపరచాలని తమిళనాడులోని దురైయూర్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌పై పలు చీటింగ్ కేసులు నమోదైనాయి. అనేక సార్లు పవర్ స్టార్ శ్రీనివాసన్ ను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా, దురైయూర్‌ ప్రాంతానికి చెందిన వ్యాపారి వరదరాజన్‌ అనే వ్యక్తికి పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ ఒక ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ నుంచి కొన్ని కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. తరువాత వరదరాజన్ దగ్గర శ్రీనివాసన్ రూ. 30 లక్షలు కమీషన్ తీసుకున్నాడు.

Tamil Nadu court orders arrest Tamil film actor Powerstar Srinivasan

తరువాత వరదరాజన్‌కు పవర్ స్టార్ శ్రీనివాసన్‌ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ నుంచి ఎలాంటి రుణం ఇప్పించలేదు. దీంతో బాధితుడు వరదరాజన్ తాను ఇచ్చిన రూ. 30 లక్షలు తిరిగి ఇవ్వాలని చెప్పాడు. రెండు సంవత్సరాల క్రితం వరదరాజన్ కు శ్రీనివాసన్ రూ. 30 లక్షలకు చెక్కు ఇచ్చాడు.

శ్రీనివాసన్ ఇచ్చిన చెక్కు బ్యాంక్‌లో బౌన్స్‌ అయ్యింది. తాను మోసపోయానని భావించిన వరదరాజన్‌ దురైయూర్‌ క్రైం బ్రాంచ్ కోర్టులో పవర్ స్టార్ శ్రీనివాసన్‌ మీద పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ కేసు అనేక సార్లు కోర్టులో విచారణకు వచ్చినా శ్రీనివాసన్‌ మాత్రం ఒక్క సారికూడా హాజరు కాలేదు.

గురువారం మరోసారి న్యాయమూర్తి సమక్షంలో పిటిషన్ విచారణకు వచ్చింది. శ్రీనివాసన్‌ మళ్లీ కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి వడివేలు పవర్ స్టార్ శ్రీనివాసన్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచాల్సిందిగా స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

చెన్నైలో ఉన్న శ్రీనివాసన్ ను అరెస్టు చెయ్యడానికి దురైయూర్ పోలీసులు సిద్దం అయ్యారు. స్వతహాగా వైద్యుడు అయిన శ్రీనివాసన్ పలు తమిళ సినిమాల్లో నటిస్తూ తనంతకు తానుగానే పవర్ స్టార్ అనే బిరుదు ప్రకటించుకున్నాడు. చీటింగ్ కేసులో పవర్ స్టార్ శ్రీనివాసన్ తీహార్ జైలుకు వెళ్లి జామీను మీద బయటకు వచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+