ఏంటి సార్ "డిప్యూటీ సీఎం" అని మర్చిపోయారా.. బిగ్ బాస్ బ్యూటీ పిక్స్ షేర్ !
తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ నివాశియ్ని కృష్ణన్ గ్లామరస్ ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన తర్వాత వెంటనే తొలగించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అంతే కాకుండా ఉదయనిధి ఆ పోస్టుకు సంబంధించిన కామెంట్ సెక్షన్‌ను కూడా నిలిపివేశారు. అయితే అప్పటికే స్క్రీన్‌షాట్లు వైరల్‌గా మారడంతో వివాదం మరింత హాట్ టాపిక్ అవుతోంది.
ఈ సంఘటనపై ప్రతిపక్ష పార్టీ నేతలు గుప్పుగా విమర్శలు చేశారు. నెటిజన్లు కూడా జోరుగా చర్చిస్తున్నారు. "కొత్త గర్ల్‌ఫ్రెండ్" అంటూ సోషల్ మీడియా వేదికపై కామెంట్లు, ట్రోలింగ్ విరాళాలు పెరిగాయి. ఈ ఘటన కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాక, రాజకీయ విమర్శల వేదికగా కూడా మారింది.

నివాశియ్ని కృష్ణన్..
నివాశియ్ని కృష్ణన్ సింగపూర్ మోడల్, తమిళనాడు మూలాలు ఉన్న వ్యక్తి. తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా ఆమె ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఆమె త్వరలో పార్టీలో చేరబోతున్నారని కూడా వార్తలు ఉన్నాయి.
సినీ కెరీర్..
డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ సినీ రంగంలో ప్రజలకు పరిచయమయ్యారు. 2008లో ప్రొడ్యూసర్‌గా సినిమాల్లో అడుగుపెట్టిన ఆయన 2012లో "ఒరు కాల్ ఒరు కన్నడి" సినిమాలో హీరోగా మారారు. ఈ సినిమా తెలుగులో "ఓకే ఓకే" పేరుతో డబ్ అయి మంచి విజయాన్ని సాధించింది. అలానే పలు సినిమాల్లో కూడా నటించి అలరించారు.
పొలిటికల్ ఎంట్రీ..
2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికెని నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఉదయనిధి. 2022 డిసెంబర్ 14న స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో డిప్యూటీ ముఖ్యమంత్రి గా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications