ఇంట్లో రివాల్వర్ తో కాల్చుకుని డీఐజీ ఆత్మహత్య, పక్క రూమ్ లో భార్య !
చెన్నై/కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరు డివిజన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) సీ. విజయకుమార్ శుక్రవారం ఉదయం కోయంబత్తూరు నగరంలోని రెడ్‌ఫీల్డ్స్ ఏరియాలోని ఆయన ఇంట్లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. డీఐజీ విజయ్ కుమార్ కు 45 సంవత్సరాలు. కోంబత్తూరుకు బదిలి అయిన విజయ్ కుమార్ అదే కోయంబత్తూరులోని రెడ్ ఫీల్డ్స్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లో ఆయన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.
శుక్రవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న డీఐజీ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు సంబంధిత పోలీసు వర్గాలు తెలిపాయి. డీఐజీ విజయ్ కుమార్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోందని తమిళనా డీజీపీ శంకర్ జైవాల్ అంటున్నారు. అయితే పని ఒత్తిడితో డీఐజీ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోలేదని తమిళనాడు డీజీపీ శంకర్ జైవాల్ అంటున్నారు.

జీవితంలో తీవ్ర మనోవేదనకు గురైన డీఐజీ విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం డీఐజీ విజయ్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. సీనియర్ పోలీసు అధికారులు కోయంబత్తూరులోని డీఐజీ విజయ్ కుమార్ ఇంటి ముందు మకాం వేశారు. డీఐజీ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన భార్య అదే ఇంటిలోని పక్కరూమ్ లో ఉన్నారని పోలీసు అధికారులు అంటున్నారు.
విజయకుమార్ కొన్ని వారాలుగా నిద్రలేమితో బాధపడుతున్నారని, తీవ్ర మనోవేదనకు లోనయ్యారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం ఆచ్చీయా. అయితే డీఐజీ విజయ్ కుమార్ అతని జీవితాన్ని ముగించాలనే నిర్ణయంపై డెత్ నోట్ లో ఖచ్చితమైన కారణం తెలియరాలేదు తమిళనాడు డీజీపీ శంకర్ జైవాల్ అంటున్నారు. ఈ విషాద ఘటనపై అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.
విజయకుమార్ జనవరి 6, 2023న కోయంబత్తూరు పరిధిలోని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు, విజయ్ కుమార్ కు ముందుగా కోయంబత్తూరు డవిజన్ డీఐజీగా పని చేస్తున్న ఎంఎస్ ముత్తుసామి వేలూరు రేంజ్ డీఐజీగా నియమించబడిన తర్వాత విజయ్ కుమార్ ను కోయంబత్తూరుకు బదిలి చేశారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) 2009 బ్యాచ్ కు చెందిన విజయ్ కుమార్ తన కెరీర్ మొత్తంలో వివిధ హోదాల్లో పనిచేశారు.

కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూర్ జిల్లాల్లో విజయ్ కుమార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహించారు. డీజీపీ పదోన్నతి పొందక ముందు చెన్నైలోని అన్నానగర్‌లో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. డీఐజీగా పదోన్నతి పొందిన తరువాత కోయంబత్తూర్ రేంజ్‌కు పోస్ట్ చేయబడింది. డీఐజీ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ తీవ్రవిచారం వ్యక్తం చేశారు.
తమిళనాడు ప్రభుత్వం టార్చర్ తట్టుకోలేక డీఐజీ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అయితే పని ఒత్తిడి కారణంగా డీఐజీ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోలేదని తమిళనాడు డీజీపీశంకర్ జైవాల్ అంటున్నారు. ప్రతిపక్షాల మాత్రం తమిళనాడు ప్రభుత్వం. పోలీసు అధికారుల టార్చర్ కారణంగా విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications