Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్లేబాయ్ పాపం పండింది, 100 పోర్న్ వీడియోలు సీజ్ ?, క్రిమినల్, అమ్మాయిలు, ఆంటీల లొకేషన్ షేర్ !

చెన్నై/ కన్యాకుమరి: అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని వారికి వల వేసి శారీరక సుఖంతో వారిని దగ్గర చేసుకుని రహస్యంగా నగ్న వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్లేబాయ్ కాశీ (26) అనే కామాంధుడి పాపం పండిపోయింది. కాశీని తమిళనాడులోని కన్యాకుమరి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అమ్మాయి, ఆంటీల నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చెయ్యడానికి కాశీకి సహకరించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్న అతని 19 ఏళ్ల ముఖ్య అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలు, ఆంటీలతో రాసలీలలు సాగిస్తున్న సమయంలో కాశీ అతని ఫ్రెండ్స్ కు లొకేషన్ షేర్ చేసేవాడని తెలిసింది. అమ్మాయిలు, ఆంటీలను కాశీ, అతని స్నేహితులు బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆడియో టేపులు విడుదల కావడంతో కలకలం రేపింది. కాశీతో సంబంధాలు ఉన్న అమ్మాయిలు, మహిళలు ఎక్కడ మా జీవితాలు నాశనం అవుతాయో అంటూ ఇప్పుడు హడలిపోతున్నారు.

19 ఏళ్లకే క్రిమినల్ మైండ్

19 ఏళ్లకే క్రిమినల్ మైండ్

తమిళనాడులోని నాగర్ కవిల్ కు చెందిన కాశీ అలియాస్ సుజి (26) అనే కామాంధుడు సోషల్ మీడియాలో సుమారు 100 మంది అమ్మాయిలు, ఆంటీలు, వివాహిత మహిళలను వలలో వేసుకుని వారి జీవితాలతో ఆడుకున్నాడు. కామాంధుడు కాశీకి నాగర్ కోవిల్ లోని అబ్జ్వర్ స్ట్రీట్ లో నివాసం ఉంటున్న డెసన్ జినో (19) అనే యువకుడు సహకరించాడని పోలీసులు గుర్తించారు. డెసన్ జినోకు 19 ఏళ్ల కూడా పూర్తి కాలేదని, అతనికి క్రిమినల్ మైండ్ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అమ్మాయిలు, ఆంటీల లొకేషన్ షేరింగ్

అమ్మాయిలు, ఆంటీల లొకేషన్ షేరింగ్

కాశీ అమ్మాయిలు, ఆంటీలను నమ్మించి రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లిన సమయంలో అతను తన స్నేహితులకు లొకేషన్ షేరింగ్ చేస్తాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అమ్మాయిలు, కాశీ ఉన్న ప్రాంతానికి అతని స్నేహితులు వెళ్లి రహస్యంగా వీడియోలు, ఫోటోలు తీస్తున్నారని, వారు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ వివరాలు రికార్డు చేస్తున్నారని పోలీసుల విచారణలో బయటపడింది.

బెండ్ తీస్తే ఆడియో, వీడియోలు వచ్చాయి

బెండ్ తీస్తే ఆడియో, వీడియోలు వచ్చాయి

కాశీ చేతిలో మోసపోయి బ్లాక్ మెయిల్ కు గురైన చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రి వైద్యురాలు ఫిర్యాదు చెయ్యడంతో కాశీ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. కాశీని అరెస్టు చేసిన నాగర్ కోవిల్ పోలీసులు అతన్ని కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు అనుమతితో కాశీని పోలీసులు కస్టడీలోకి తీసుకుని బెండ్ తీశారు. పోలీసులు బెండ్ తియ్యడంతో కాశీ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న సమయంలో రికార్డు చేసిన కొన్ని ఆడియో టేపులు, వీడియోలు బయటకు వచ్చాయి.

కాశీ వెనుక చాలా పెద్ద గ్యాంగ్ ఉంది

కాశీ వెనుక చాలా పెద్ద గ్యాంగ్ ఉంది

సుమారు 100 మందికి పైగా అమ్మాయిలు, వివాహిత మహిళల జీవితాలతో చెలగాటం ఆడుకున్న కాశీ వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే నాగర్ కోవిల్ లోని కాశీ ఫ్రెండ్స్ ఇండ్లలో సోదాలు చేసిన పోలీసులు అతనికి సంబంధించిన ల్యాప్ టాప్ లు, సీక్రెట్ కెమెరాలు, మొబైల్ ఫోన్లు, సీక్రెట్ మొబైల్ వాచ్ లు స్వాధీనం చేసుకున్నారు. కాశీ ఒక్కడే ఇంత దందా చెయ్యడానికి అవకాశం లేదని, అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చెయ్యడానికి అతని వెనుక చాల పెద్ద గ్యాంగ్ ఉందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

100 పోర్న్ వీడియోలు సీజ్ ?

100 పోర్న్ వీడియోలు సీజ్ ?

కాశీ అమ్మాయిలు, వివాహిత మహిళలతో రాసలీలలు సాగిస్తున్న సమయంలో సుమారు 100కు పైగా పోర్న్ వీడియోలు చిత్రీకరించారని పోలీసుల విచారణలో వెలుగు చూసిందని సమచారం. కాశీ అమ్మాయిలతో రాసలీలలు సాగిస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలను డెసన్ జినో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నాని కన్యాకుమరి జిల్లా ఎస్పీ ఎన్, శ్రీనాథ్ మీడియాకు చెప్పారు. డెసన్ జినోను కోర్టు ముందు హాజరుపరిచి అతన్ని జ్యూడీషియల్ కస్టడీకి తరలించామని కన్యాకుమరి జిల్లా ఎస్పీ శ్రీనాథ్ అన్నారు.

 పాటుపడిన ప్లేబాయ్ పాపం పండింది !

పాటుపడిన ప్లేబాయ్ పాపం పండింది !

సోషల్ మీడియాలో అమ్మాయిలు, ఆంటీలతో పరిచయం పెంచుకున్న కాశీ తరువాత వారిని రహస్య ప్రాంతాలకు, విహార యాత్రలకు పిలుచుకుని వెళ్లి వారితో రాసలీలలు సాగించాడు. రాసలీలలు సాగిస్తున్న సమయంలో అమ్మాయిలు, ఆంటీల నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. అమ్మాయిలు, ఆంటీలను ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లి ఇంతకాలం ఎంజాయ్ చేశాడు. ఇంత కాలం కాశీ చాలాపాటు పడ్డాడని, ఇప్పుడు అతని పాపం పండిపోయిందని పోలీసులు చెప్పారు.

ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేశాడు ?

ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేశాడు ?

అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చేసిన తరువాత కాశీ వరుసపెట్టి వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ అందినకాడికి అందినంత అంటూ నగలు, డబ్బులు లాక్కొంటున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇప్పటి వరకు కాశీ, అతని అనుచరులు ఎంత మందిని బ్లాక్ మెయిల్ చేశారు ? అని కన్యాకుమరి పోలీసులు ఆరా తీస్తున్నారు. చాలా మంది అమ్మాయిలు, వివాహిత మహిళలు పరువు పోతుందనే భయంతో కాశీ మీద ధైర్యంగా ఫిర్యాదు చెయ్యడానికి సాహసం చెయ్యలేకపోతున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+